డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే వాటిలో కొన్నిమాత్రం ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి. అలాంటివాటిలో పిస్తా పప్పుకూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పిస్తాలో జింక్ ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి పిస్తా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్ B6 రోగనిరోధక పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
అలాగే దీనిలోని సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేయడంతో.. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. పిస్తాపప్పులో ఉండే పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులోని ప్రీబయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియా శ్లేష్మ పొర రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
పిస్తాలో ఉండే జింక్ వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని, తీవ్రతను తగ్గిస్తుంది. నిజానికి పిస్తాపప్పు సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన ఆహారంగా నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకు డైట్ చేసేవాళ్లు కచ్చితంగా తమ ఆహారంలో పిస్తాను యాడ్ చేసుకోవాలని అంటారు. ఇది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. పిస్తాపప్పులో ఉండే ఏఎమ్డీ కంటిశుక్లాలు, కళ్లపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతూ.. కంటి దృష్టిని కాపాడుతుంది.
అంతేకాదు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వాటిలోని పోషక విలువలు..మీ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీనిని డైరక్టుగా తీసుకోవచ్చు. లేదా సలాడ్లు, ఇతర డెజర్ట్‌లలో కూడా వేసుకుని తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా పిస్తా పప్పు ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.