డ్రై ఆప్రికాట్లు చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్ అయిన డ్రై ఆప్రికాట్లలోని జీడిపప్పు , బాదంపప్పు కంటే పోషకాలు తక్కువేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఐరన్ లోపంతో బాధపడే వారు ఎండిన ఆప్రికాట్ తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆప్రికాట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ప్రేగులను శుభ్రం చేయడంతో పాటు.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
రుచితో పాటు బోలెడు పోషక విలువలను కలిగి ఉన్న పండు ఆప్రికాట్స్‌లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఇతర కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి
మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో పని చేస్తాయి. ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఆప్రికాట్లో ఉండే ఫైటోకెమికల్స్ వాటికి మంచి రంగును, రుచిని, పోషక విలువలను అందిస్తాయి.
ఆప్రికాట్‌లో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఆప్రికాట్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో.. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి దోహదపడుతాయి. దీనిలోని కాల్షియం ఎముకలు బలంగా మారడానికి సహకరిస్తుంది. ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెరిగి..రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తూనే.. ప్రేగులను శుభ్రం చేస్తాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. వృద్ధాప్యచాయలను దరిచేరకుండా చేయడంతో పాటు.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతి రోజూ రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.