కొన్నిసార్లు మనం తీసుకున్న ఆహారం.. సరైనది కానప్పుడో, శరీరానికి పడనప్పుడో ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొన్ని రకాల ఆహారాల పదార్థాలను కలిపి తినడంవల్ల కూడా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ప్రతీ ఒక్కరూ అవగాహన కల్పించుకుని వాటిని తీసుకోకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు.
కూల్ డ్రింక్స్, పులియ బెట్టిన ఆహారాలు ఎక్కువ స్థాయిలో చక్కెరలు కలిగి ఉంటాయి. ఈ రెండిటిని షుగరింగ్ డ్రింక్స్‌తో కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. నిజానికి వేటితో కాకుండా ఓన్లీ కూల్ డ్రింక్స్, షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింకులు తాగితే మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
క్యాబేజీ, బీన్స్ లో ఉండే పోషకాల వల్ల క్యాబేజీ, బీన్స్ కలిపి తినకూడదు. ఈ రెండిటిని కలిపి తినడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ జీర్ణ సమస్యలను పెంచుతాయి.
సిట్రస్ ఫ్రూట్స్, మిల్క్ కూడా కలిపి తినకూడదు. ముఖ్యంగా ఆరెంజ్, ద్రాక్ష, దానిమ్మ వంటి సిట్రస్ పండ్లతో పాలు, పాలతో తయారు చేసిన ఇతర ఆహారాలను కానీ, పాలుతో కలిపి కానీ తీసుకోకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.ముఖ్యంగా ఎసిడిటీని పెంచుతాయి.
టమాటాలు, స్టార్చ్ ఫుడ్స్ కలిపి తినకూడదు. టామాటా సాసెజ్‌ను కొందరు బ్రెడ్, పాస్తా వంటి వాటితో కలిపి తింటుంటారు. అయితే అలా తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి.
కొవ్వు పదార్థాలు, పచ్చి కూరగాయలు కలిపి తీసుకోకూడదు. ఫ్రై చేసిన ఆహార పదార్ధాలను, అలాగే సాసెజ్‌లలో ఉండే హై ఫ్యాట్ ఫుడ్స్‌ను పచ్చి కూరగాయలతో కలిపి తినకూడదు.ఇవి శరీరానికి అందాల్సిన న్యూట్రియెంట్స్ అందకుండా చేస్తాయి.