చలికాలంలో దగ్గు, జలుబు వేధిస్తుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకూ దగ్గు , జలుబుతో నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే శరీరంలో ఉండే చెడు టాక్సిన్లను బయటకు పంపించడానికి అశ్వగంధ బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం కానీ రెండు పూటలా కానీ.. అశ్వగంధం పొడితో తయారు చేసిన టీ తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయటపడటమే.. కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
చిటికెడు అశ్వగంధ పొడిలో రెండు తులసి ఆకులు కొద్దిగా నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. అది బాగా మరిగాక వడకట్టి కాస్త తేనె కలిపి గోరువెచ్చగా తాగితే .. ఈ టీలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.ఈ టీ రెగ్యులర్‌గా తాగినవారిలో వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయి. వీటిలోని పోషకాలు క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరడంలోనూ బాగా సహాయపడతాయి. అలాగే అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించడంలోనూ బాగా పనిచేస్తుంది.
అశ్వగంధం టీ లోని పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే శరీరంలో ఉండే చెడు టాక్సిన్లను బయటకు పంపించడంలో అశ్వగంధ టీ బాగా పనిచేస్తుంది. డైలీ అశ్వగంధం టీ తాగడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడితో బాధపడుతున్నవారికి ఈ టీ సహాయపడుతుంది. ఈ టీ లోని పోషకాలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.నిద్ర లేమి సమస్యలతో బాధపడే వారు ఈ టీ తాగితే మంచి ఫలితాలుంటాయి.
ప్రతీరోజూ ఉదయం అశ్వగంధ టీ తాగడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా విరేచనాలు, జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి. ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. దీనిలోని పోషకాలు ఇన్సులిన్‌ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి..దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గుతాయి.