సోషల్ మీడియాతో టైమ్ పాస్ వద్దు.. ఫ్యామిలీతో సమయం గడపడం ముద్దు

Social media, Family members,Communication skills, Outdoor activities, Spend time with family, not on social media,Never Prioritize Social Media Over Spending Time With The Family Members,Never Prioritize Social Media,Social Media Over Spending,Spending Time With The Family Members,Mango News, Mango News Telugu,Social Media Platforms,Social Media Apps,Social Media Effects On Youth,Negative Impact Of Social Media On Youth,Negative Effects Of Social Media

హెల్త్ ఈజ్ వెల్త్ అన్న మాట చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. అందుకే అంతా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ పెద్దలు పదేపదే చెప్పే మాటలు వింటూనే పెరిగాం. అయితే ఉరుకుల పరుగుల బిజీ బిజీ లైఫ్‌లో కుటుంబంతో గడపడానికే ఎవరికీ టైమ్ ఉండటం లేదు. అయితే కొంత మంది ఉన్న కాస్త టైమ్ సోషల్ మీడియా తోనే గడిపేస్తున్నారు. అయితే ఫ్యామిలీతో గడపండి.. సోషల్ మీడియాలో కాదు ఎందుకంటే.. కుటుంబంతో సమయం గడపడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. హెల్ విత్ ఫ్యామిలీ అంటున్నారు. అవును.. ఫ్యామిలీతో కాస్త సమయం గడపినా.. దాని వల్ల శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారట.

ఒకప్పుడు ఇంటిళ్లపాదీ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి అయ్యాక అంతా కలిసి భోజనాలు చేసే రోజులు పోయి.. మొబైల్‌తో ముచ్చట్లు చెబుతూ మమ అనిపించే రోజులు వచ్చేశాయి. పోనీ కాసేపు అయినా అంతా సరదాగా కూర్చుని కాసేపు మాట్లాడుకుంటారా అంటే తెల్లారి లేస్తే ఫోన్.. పడుకునే ముందు ఫోన్‌తో గడిపేస్తున్నారు. లేచాకా గుడ్ మార్నింగ్ అని ఇంట్లోవాళ్లను పలకరించరు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం శుభోదయం నుంచి శుభరాత్రి వరకూ టచ్ లోనే ఉంటున్నారు. అయితే ఇక్కడే వీరంతా తెలియకుండా పొరపాటు చేస్తున్నారని డాక్టర్లు అంటున్నారు.

ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం వల్ల తెలియకుండానే చాలామంది డిప్రెషన్, ఆందోళనకు గురవుతున్నారట. ఇలాంటి వారు కాసేపయినా ఫ్యామిలీతో కూర్చుని మాట్లాడటం వల్ల తెలీకుండానే కొత్త ఉత్సాహం వస్తుందట. అంతెందుకు కుటుంబంతో సమయం గడిపే పిల్లలు కూడా స్కూల్లో చాలా యాక్టివ్ గా ఉంటారట. అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే.. స్కూల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో పేరెంట్స్‌కి తెలియడంతో పాటు.. పిల్లలకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ముందే వాటిని అర్ధం చేసుకుని పిల్లలను కాపాడుకోవచ్చు కూడా.

చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ.. ఫ్యామిలీ మెంబర్స్‌ తో టైమ్ స్పెండ్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా సమస్య వస్తే దానికి కుటుంబ సభ్యులు పరిష్కారం చూపిస్తారన్న నమ్మకం ఉండటంతో.. తమ వెనుక ఉన్నారన్న ధైర్యంతో వాళ్లు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎవరిదారి వారిదే అన్నట్లు కాకుండా.. అంతా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుంటే ఎలాంటి క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. సమస్యల పరిష్కారానికే కాదు.. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్చుకునే అలవాటు కూడా వస్తుంది.

మరోవైపు కుటుంబంతో సమయం గడపడం వల్ల.. అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. చాలామందిలో అలసట, నీర్సం, రక్తపోటుతో ఇబ్బందులు పడతారు. దీనివల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై కూడా ఎక్కువ ప్రభావాన్ని ప్రభావాన్ని చూపిస్తుంది. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో.. తమ ఇబ్బందులను, కష్టాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకున్నప్పుడు పల్స్, రక్తపోటు రీడింగ్ తగ్గిందని తేలిందట. కాబట్టి వీలు చూసుకుని మరీ కుటుంబంతో సమయం గడపండని డాక్లర్లు పదే పదే చెబుతున్నారు.

అంతేకాదు.. మీలో కాన్ఫిడెన్స్ పెరగడానికి మీమీద మీరు శ్రద్ధ చూపించుకోవడానికి ఆసక్తి పెంచేలా చేస్తుందట. అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి తినడం వల్ల మనసు ఉల్లాసంగా ఉండటంతో పాటు ఇంటి భోజనం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాం. అలాగే అంతా కలిసి గేమ్‌లు, గార్డెనింగ్, అవుట్ డోర్ యాక్టివిటీస్‌ లో పాల్గొనడం వల్ల ఫిటెనెస్‌ కూడా పెరుగుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంచుకోవడం వల్ల.. మెంటల్ అండ్ ఫిజికల్ గా శక్తివంతులుగా ఉంటాం. అందుకే సోషల్ మీడియా సైట్లలో గంటల తరబడి కేటాయించి అనారోగ్యాన్ని తెచ్చుకునే బదులు.. ఆ సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపి ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా గడపాలని డాక్టర్లు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =