శంఖం పూలలో శక్తివంతమైన నీలం రంగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తుంది. శంఖం పూలల్లో యాంటీ గ్లైకేషన్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో.. ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
అందుకే ప్రతీ రోజూ శంఖం పూల టీని తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై గీతలు, ముడతలు పడవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శంఖం పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల అధికంగా ఉండటంతో.. ఇవి చర్మాన్ని అలర్జీల నుంచి కాపాడతాయి.
ఈ శంఖం పూలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉండటంతో.. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి కూడా పనికొస్తాయి.శంఖం పూలతో చేసిన టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పోషకాలను అందిస్తుంది.
వీటిలో విటమిన్ ఎ, సి, ఇ లు పుష్కలంగా ఉండటంతో.. ఇవన్నీ చర్మంపై పొరని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. శంఖం పూలతో తయారు చేసిన బ్లూ టీని తాగడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే .. ఎలాంటివారికి అయినా మంచి మార్పు కనిపిస్తుంది.
దీనికోసం శంఖం పూలను బాగా ఎండబెట్టి, గాలి చొరబడని ఎయిర్ టైట్ సీసాల్లో భద్రపరచుకోవాలి. టీ తాగాలనిపించినప్పుడు మూడు, నాలుగు ఎండు పూలను తీసి వేడినీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. నీటిలో ఈ పూలను వేసి మరిగిస్తే..నీరంతా నీలం రంగులోకి మారుతుంది.తర్వాత ఈ టీని ఓ గ్లాసులోకి వడకట్టకుని, అందులో కాస్త తేనె చేర్చుకుని తాగాలి. అంతేకాదు.. ఈ పూలతో హెయిర్ మాస్క్ లు, ఫేస్ మాస్కులు వేసుకున్నా మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.