తేనె, పసుపు కలిపి తీసుకుని బరువు తగ్గొచ్చా? మరి వీటిని ఎలా తీసుకోవాలో తెలుసా?

Can You Lose Weight By Mixing Honey And Turmeric, Can You Lose Weight, Mixing Honey And Turmeric For Lose Weight, Honey, Lose Weight By Mixing Honey And Turmeric?, Turmeric, Weight Loss, Weight Loss Tips, Weight Loss Meal Plan, Faster Way To Fat Loss, Weight Loss Food, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి వారు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. అయితే పసుపు, తేనె కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. పసుపులో యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఇన్‍ఫ్లమేషన్ తగ్గించి.. ఊబకాయం తగ్గించడంతో ఉపయోగపడుతుంది. జీవక్రియను, జీర్ణశక్తిని పసులు మెరుగుపరిచి.. ఆకలి కలిగించే హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది.

అలాగే తేనెలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో..చక్కెరకు సహజమైన ప్రత్నామ్నాయంగా ఉంటుంది. ఇది క్యాలరీలు ఎక్కువగా తీసుకోకుండా చేయగలదు. నిద్ర కూడా బాగా పట్టేలా చేయడంతో పాటు..శరీరానికి కీలకమైన పోషకాలు అందిస్తుంది. అందుకే తేనె కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే తేనె, పసుపు కలిపి తీసుకుంటే వేగంగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

గ్లాసు గోరువెచ్చని పాలల్లో టీస్పూన్ పసుపు, కాస్త మిరియాల పొడి, కొంచెం తేనె వేసుకోవాలి. ఇది రాత్రి నిద్రపోయే ముందుఈ గోల్డెన్ మిల్క్ తాగితే.. జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది. శరీరం, మనసు ప్రశాంతంగా మారుతుంది. బరువు తగ్గడానికి ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది. రాత్రి పూట వీలుకాదు అనుకున్నవాళ్లు ఉదయం కూడా ఈ పాలు తీసుకోవచ్చు.

అలాగే పసుపు టీ కూడా బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఓ కప్ నీటిలో ఓ టీస్పూన్ పసుపు వేసి మరిగించుకోవాలి. దాంట్లో కాస్త నిమ్మరసం పిండి..ఆ టీని కాస్త చల్లార్చి ఓ స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఈ పసుపు టీ తాగితే జీవక్రియ చాలా మెరుగవుతుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవ్వడానికి ఈ టీ ఉపయోగపడుతుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది.

అంతేకాదు కూరగాయలు, ఆకుకూరలతో చేసుకునే సలాడ్లలో తేనె, పసుపు వేసుకున్నా కూడా చాలా మంచింది.దీని వల్ల సలాడ్‍కు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సలాడ్‍లో కాస్త పసుపు, తేనెతో పాటు కొంచెం నిమ్మరసం పిండుకుంటే.. బరువు తగ్గడానికి మరింత ఉపకరిస్తుంది. కూరగాయలతో చేసుకునే స్మూతీల్లో కూడా పసుపు వేస్తే రుచితో పాటు మంచి కలర్ వస్తుంది.స్మూతీ పోషక విలువలు కూడా పెరుగుతాయి.