స్వీట్లు అంటే మామూలుగానే చాలామంది ఇష్టపడతారు. స్వీట్స్ ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టేస్తారు. ఇప్పుడు కాస్త అవేర్నెస్ వచ్చి తీపి పదార్థాలకు దూరంగా ఉంటున్నా కూడా మనసు మాత్రం పదేపదే స్వీట్స్ తినమని చెబుతుంది. కొంతమంది కంట్రోల్ చేసుకున్నా..మరికొంతమంది మాత్రం ఆగలేక తినేస్తుంటారు.
అయితే ఇలాంటివారిలో కొన్ని విటమిన్స్ లోపం ఉంటుందని అందుకే ఇలా కంట్రోల్ చేసుకోలేక తినేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ఈ లోపం ఉందేమో వెంటనే చెక్ చేసుకోవాలని అంటున్నారు. ఈ విటమిన్ లోపం ఉన్నవారిలోనే స్వీట్లు తినాలనే కోరిక ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెప్పాయని చెబుతున్నారు. వెంటనే ఆ బలహీనతను వదిలించుకోవడానికి ప్రయత్నించాలని లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఈ విటమిన్ లోపం వల్ల కూడా ఎక్కువగా స్వీట్లు తినాలని అనిపిస్తుందట . విటమిన్ B1 అంటే థయామిన్, B3 అంటే నియాసిన్, B5 అంటే పాంతోతేనిక్ యాసిడ్, B6 అంటే పిరిడాక్సిన్ ఈ విటమిన్లు అన్నీ చక్కెర, శక్తికి సంబంధించినవి. ఇవి లోపిస్తే గనక బాడీలో గ్లూకోజ్ తగ్గిందనే సంకేతం మెదడుకు వెళ్లి పదే పదే షుగర్స్ తీసుకోవాలని మనల్ని ప్రేరేపిస్తుంది. అలా అని షుగర్స్ ఎక్కువగా తింటే..శరీరంలో పరిమితికి మించి గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, జింక్ వంటి ఖనిజాలు మనిషి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఈ పోషకాలు లోపించినా కూడా తీపి పదార్ధాలు ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. రక్తంలోని చక్కెర్ స్థాయిలో ఏర్పడే హెచ్చుతగ్గుల వల్ల స్వీట్లు ఎక్కువగా తింటారు.అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మొత్తం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. పీరియడ్స్, మెనోపాజ్ వంటివి కూడా చాలా మార్పులను తీసుకువస్తాయి. దీని వల్ల స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది.