తల వెంట్రుకలు మన అందానికి ప్రతీక. తలపై వెంట్రుకలు ఉంటే అది ఒక రకమైన కిరీటం లాంటిది. దీంతో సమాజంలో మరింత గౌరవం కూడా లభిస్తుంది. కానీ ఇటీవలి కాలంలో పని ఒత్తిడి, అనేక ఇతర కారణాల వల్ల పురుషులు తల వెంట్రుకలు రాలిపోయి అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ అనేక కారణాలు ఉన్నాయి. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, కింది పరిస్థితులలో పురుషుల తల వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయాట.. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పురుషుల జుట్టు త్వరగా రాలిపోతుంది. ఇది వారు తీసుకునే మందులు లేదా థైరాయిడ్ సమస్య వల్ల కూడా రావచ్చు. దీన్ని త్వరగా తగ్గించుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పురుషుల వయస్సుతో, శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పరిమాణం తగ్గుతుంది. ఇలా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం వలన కూడా జుట్టు రాలడం సహజమే. దీనికి తోడు జుట్టుకు సంబంధించిన ఉత్పత్తులను వాడటం వల్ల కెమికల్స్ పెరిగి జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వల్ల కూడా చాలా త్వరగా జుట్టు రాలిపోతుంది. అంతే కాదు మనం తినే ఆహారంలో విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల జుట్టు రాలిపోతుంది. మనం ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, బయోటిన్ మరియు ఐరన్ ఎక్కువగా తీసుకుంటే, జుట్టు రాలడం సమస్యను దూరం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
మానసిక ఒత్తిడి పెరిగేకొద్దీ జుట్టు ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడిని అదుపు చేయడంపై దృష్టి సారిస్తే జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం యోగా, మెడిటేషన్ సాధన చేయాలి. చాలా మంది తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి మరియు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి వివిధ రకాల చికిత్సలను కోరుకుంటారు. కీమోథెరపీ వంటివి. ఇలాంటి ట్రీట్ మెంట్స్ చేయించుకుంటున్నప్పుడు వీటి సైడ్ ఎఫెక్ట్ తో జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు : శిలీంధ్రాలు లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. హెల్తీ హెడ్ హెయిర్ అంటే స్కాల్ప్ ఆరోగ్యాన్ని చక్కగా నిర్వహించడం మరియు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు లేకుండా ఉండాలి. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా వినరు. ఇది తలలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది మరియు జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. దీని వల్ల కూడా చాలా జుట్టు రాలిపోతుంది.
హెయిర్ స్టైల్ మరియు హెయిర్ ట్రీట్‌మెంట్స్: ఈ రోజుల్లో ప్రజలు హెయిర్ స్టైల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ సందర్భంలో అనేక రసాయనాలు మరియు విద్యుత్ వేడిని ఉపయోగిస్తారు. ఇది జుట్టు యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. అంతేకాదు చాలా త్వరగా జుట్టు రాలడం సమస్యకు దారితీస్తుంది.
చివరి మాట : జుట్టు రాలడం అనేది పురుషులందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కొద్దిగా రాలితే మరికొందరికి ఎక్కువగా జుట్టు రాలుతుంది. మీరు తరచుగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి సరైన చికిత్స పొందండి.