బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసే అలవాటుందా? అయితే ఇది మీకోసమే..

Do You Have A Habit Of Skipping Breakfast Then This Is For You, Skipping Breakfast Then This Is For You, Habit Of Skipping Breakfast, Breakfast Skipping, Breakfast, Do You Have A Habit Of Skipping Breakfast?, Skipping Breakfast, Disadvantages Skipping Breakfast, Effects Of Skipping Breakfast, Health, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

చాలామంది బిజీబిజీ లైఫ్ వల్ల ఉదయం పూట తినకుండానే పనుల్లో పడతారు. అలా ఒకరోజో రెండు రోజులో పర్వాలేదు కానీ అదే అలవాటుగా మార్చుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లు మూడు పూటలా మంచి ఫుడ్ తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని అంటారు.

ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం హడావుడిగా దినచర్య పూర్తి చేసుకుని ఆఫీసులకు,స్కూలు, కాలేజీలకు వెళ్లడాన్ని ఇప్పటి తరం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇలాగే కొంతకాలం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఎసిడిటీ, ఒబిసిటీ,గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయట.

అంతేకాకుండా శరీరానికి తగిన పోషకాలు సరిగ్గా అందవని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఇంటి పనులు చేసుకోవడం, ఆఫీసుకు వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకుంటే.. కోపం, చికాకు వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి.. మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో ఏకాగ్రతను కోల్పోతారని, చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం అలవాటుగా మారితే వారలో నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా పరిశోధకులు అంటున్నారు. దీంతో రాత్రంతా రెస్ట్ తీసుకున్న శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడంతో.. బ్రెయిన్ యాక్టివిటీలో ప్రతికూల మార్పులు వస్తాయట.దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, మానసిక ఆందోళనలు ప్రారంభమవడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.

బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఉదయం ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయి.. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. పేగు కదలికల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే తగిన పోషకలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయడంతో పాటు.. క్వాలిటీ స్లీప్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని అంటున్నారు నిపుణులు.