
ప్రపంచంలో ప్రతి పదమూడు మందిలో ఒకరి అపెండిసైటిస్ బారిన పడుతున్నారట . ఒక్క ఇంగ్లాండులోనే ప్రతి ఏడాది 40,000 మంది ఈ పొట్ట నొప్పితో ఆసుపత్రిలో చేరుతున్నారట. భారతదేశంలో కూడా ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఏటా వేలమంది కడుపునొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి అపెండిసైటిస్ గా నిర్ధారణ చేసుకుంటున్నారు. అసలు అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? కడుపునొప్పి రాక ముందు లక్షణాలు గుర్తించవచ్చా వంటివి తెలుసుకుందాం.
అపెండిసైటిస్ అంటే ఏంటి?అపెండిక్స్ అనేది చిన్న సంచిలా ఉండే అవయవం. పెద్దపేగులకు అనుబంధంగా చివరలో వేలాడినట్టు ఉంటుంది. అపెండిసైటిస్ వచ్చినప్పుడు అపెండిక్స్ వాచిపోయి తీవ్రమైన నొప్పి పెడుతుంది. ఆ నొప్పి మనకు పొత్తికడుపులో వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే మన శరీరంలో అపెండిక్స్ లేకుండా కూడా జీవించగలం కాబట్టి దాన్ని తొలగిస్తుంటారు వైద్యులు.
ఎవరికి అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉంది?అపెండిసైటిస్ ఏ వయసులో ఉన్న వారికైనా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా అయితే పదేళ్ల నుంచి ఇరవైఏళ్ల మధ్యలో ఉన్నవారిలో అధికంగా కనిపిస్తుంది. కానీ ఇది ఎందుకు సంభవిస్తుందో మాత్రం ఇంతవరకు సరైన కారణం తెలియలేదు.
లక్షణాలు ఎలా ఉంటాయి?నొప్పి హఠాత్తుగా, చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. అప్పుడు వైద్యులు మొదటగా అపెండిసైటిస్ ఏమో అని చెక్ చేస్తారు. కానీ నొప్పి కన్నా ముందు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. అవి కాస్త నీరసంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు కావడం, జ్వరం రావడం వంటివి కనిపించవచ్చు.
అపెండిసైటిస్ రావడానికి రీజనేంటి?ఈ పరిస్థితి ఎందుకొస్తుందో ఇంతవరకు సరైన కారణం తేలలేదు. అపెండిక్స్ ప్రవేశద్వారం మూసుకుపోయినప్పుడు ఇలా జరుగుతుందని భావిస్తారు. మలం అడ్డుపడడమో లేక, ఏదైనా కణితి పుట్టి ఇలా మూసుకుపోవడం జరగుతుంటుంది. ఈ పరిస్థితి ఏర్పడకుండా నిరోధించడం కష్టమే.
చికిత్స ఉంటుందా?అపెండిసైటిస్ రెండు రకాలు. ఒకటి దీర్ఘకాలిక లక్షణాలతో సాగితే, మరొకటి తీవ్రంగా వస్తుంది. అపెండిసైటిస్ తీవ్రంగా మారితే అపెండిక్స్ పగిలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. సమస్య చిన్నదైతే యాంటీ బయోటిక్స్ ఇచ్చి చికిత్స చేస్తారు. సమస్య మరీ తీవ్రమైనదైతే దాని వల్ల మానవ శరీరానికి పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి ఆ అవయవాన్ని తొలగిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY