ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో కరోనా కలకలం.. రెండు రోజుల్లో 30 మందికి పాజిటివ్

IIT-Madras 30 Students Tested Positive For Covid-19 in Two Days, 30 IIT-Madras Students Tested Positive For Covid-19 in Two Days, IIT-Madras Students Tested Positive For Covid-19 in Two Days, IIT-Madras Students, IIT-Madras Students Tested Positive For Covid-19, 30 new Covid-19 cases In IIT-Madras, IIT-Madras Covid-19 Updates, IIT-Madras Covid-19 Live Updates, IIT-Madras Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, IIT-Madras Coronavirus, IIT-Madras Coronavirus Cases, IIT-Madras Coronavirus New Cases, IIT-Madras Coronavirus News, IIT-Madras New Positive Cases, Mango News, Mango News Telugu,

ఐఐటీ మద్రాస్‌లోని క్యాంపస్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మంది కరోనా బారిన పాడగా.. ఈరోజు మరో పద్దెనిమిది మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే కారొనకు గురైన వారి సంఖ్య 30కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేయడానికి ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపింది. క్యాంపస్‌లో నివసిస్తున్న వారికి నిర్వహిస్తున్న ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలను పర్యవేక్షించడానికి ఇతర ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి శుక్రవారం రాధాకృష్ణన్ క్యాంపస్‌ను సందర్శించారు. డిసెంబర్ 2020లో కూడా IIT-మద్రాస్‌లో 183 కంటే ఎక్కువ మంది విద్యార్థులు మరియు సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

క్యాంపస్‌లో నిర్ధారణ పరీక్షల అనంతరం రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. మేము వారి నమూనాలను సేకరించాము. ఆ ఫలితాలు వచ్చే వరకు వారిని మిగిలిన వారితో వేరుచేయమని IIT యాజమాన్యానికి సూచించాము. ప్రవేశద్వారం వద్దే కాకుండా క్యాంపస్ లోపల కూడా థర్మల్ మరియు ఉష్ణోగ్రత తనిఖీలు చేస్తున్నాము. అవసరమైనప్పుడు, వ్యాధి సోకిన వారిని కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌కు తరలించడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మొత్తం 665 నమూనాలను పరీక్షించగా, వాటిలో 18 పాజిటివ్‌గా వచ్చాయి. ఐఐటీ మద్రాస్‌లో ఇప్పటి వరకు 30 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. గత రెండు వారాల్లో ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది క్యాంపస్‌కు చేరుకున్నారు. క్యాంపస్‌లోని ప్రతి హాస్టల్‌లో ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్నాయి. మందాకిని హాస్టల్‌లో అత్యధిక కేసులు గుర్తించబడినందున పై రెండు అంతస్తులు వేరు చేయబడ్డాయని చెప్పారు.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వ్యక్తులకు రూ.500 జరిమానా విధించబడుతుందని, జిల్లా కలెక్టర్లు వారిని పర్యవేక్షించాలని రాధాకృష్ణన్ కోరారు. ఇతర దేశాలలో మళ్ళీ కేసుల పెరుగుతున్నాయని, ప్రజలు టీకాలు తీసుకోవడం వాయిదా వేయకూడదని పేర్కొన్నారు. పాజిటివ్ గా తేలిన వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారేనని తెలిపారు. తమిళనాడులో ఇంకా రెండు కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉందని, దీనిని పరిగణనలోకి తీసుకుని దేశంలోనే తొలిసారిగా మే 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్ష చోట్ల ప్రత్యేక మెగా వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =