వన్ యాపిల్ ఏ డే.. కీప్స్ ది డాక్టర్ అవే అనేమాట ప్రతిసారీ వింటూనే ఉంటాం. అంటే రోజుకొక యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదని చెబుతుంటారు. నిజమే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టడంలో యాపిల్ ఎంతగానో సహాయపడుతుంది. అనేక వ్యాధుల ముప్పును తగ్గించడంలో యాపిల్ ఎంతగానో తోడ్పడుతుంది. ఒక మీడియం యాపిల్ లో 95 క్యాలరీస్ ఉంటాయి.
యాపిల్ వ్యాధి పోరాట మూలకాలను కలిగి ఉండటంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. డయాబెటిస్ బారిన పడకుండా చేయడంలో యాపిల్ ఎంతగానో సహాయపడుతుంది. ఈ రోజుల్లో చిన్న వయసు నుండి ముసలి వాళ్ల దాక డయాబెటిస్ అనే రోగం బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి ఇన్సులిన్ తగ్గడం వల్ల వస్తుంది.
ఇన్సులిన్ ని పేంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ఉత్పత్తి చేస్తాయి. ఐతే ఈ బీటా సెల్స్ కి నష్టం కలగకుండా యాపిల్ లో ఉండే పోలీ ఫినాయిల్స్ కాపాడుతాయి. రోజూ ఆపిల్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని 28 శాతం వరకు తగ్గించవచ్చు. బీటా కణాల కణజాలాన్ని దెబ్బతినకుండా చేయడంలో యాపిల్ తోడ్పడుతుంది.
యాపిల్ లో విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది ఒక ఆంటియాక్సిడెంట్ లాగా పని చేస్తుంది. యాపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదలకి దోహద పడుతుంది. ఇంతే కాకుండా యాపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల రోగాలు రాకుండా సహాయ పడుతుంది.
యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పరిశోధనల ప్రకారం ఆపిల్ ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. యాపిల్ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి.
ఫైబర్, వాటర్ కంటెంట్ యాపిల్ లో ఉండటం వల్ల యాపిల్ తింటే త్వరగా కడుపు నిండుతుంది. ఆహారం తినే ముందు యాపిల్ తింటే వాళ్లు 200 కేలరీల ఆహారం తక్కువ తీసుకుంటారని తెలుస్తోంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో యాపిల్ తోడ్పడుతుంది. కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాపిల్ ఎంతగానో సహాయపడుతుంది. ఫ్లేవనాయిడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
యాపిల్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు యాపిల్ తొక్కలో ఉండే ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో యాపిల్ ఎంతగానో సహాయపడుతుంది.
వయసు పెరిగే కొద్దీ మన ఎముకల సామర్థ్యం తగ్గుతుంది. నేలపై కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది. యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లామాటరీ సమ్మేళనాలు ఎముకల సామర్ధ్యాన్ని పెంచుతుంది అని చెప్పొచ్చు.
ముసలి వాళ్లలో యాపిల్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దీంతో అల్జీమర్స్ కు చెక్ పెట్టొచ్చు. బరువు పెరగటం అనేది ఈ రోజుల్లో ఒక సాధారణమైన విషయం అయిపోయింది. యాపిల్ తినటం వల్ల ఊబకాయం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పైగా కొవ్వు నియంత్రణలో ఉంటుంది.