గొంతులో కిచ్‌కిచ్ దేనికి సంకేతమో తెలుసా?

Do You Know What Tickle In The Throat Is, Tickle In The Throat, Throat Tickle Causes, How to Treat a Throat Tickle, How to Get Rid of Throat Tickle, Cough, Immune System, Mucus, Phlegm, Sore Throat, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness Tips, Mango News, Mango News Telugu

గొంతులో కిచ్ కిచ్ ఉంటే… ఇబ్బందే. మాటిమాటికీ గొంతు సవరించుకుంటారు. మాట్లాడటానికే ఇబ్బంది పడతారు. అలా అని ఆ కఫాన్ని మింగేస్తే చాలా ప్రమాదం. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే… మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా వస్తున్నాయనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతోందని అర్థం చేసుకోవాలి.

వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూకస్ అంటే కఫం లేదా శ్లేష్మం ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. జలుబు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలి. లేదంటే అది దగ్గును క్రియేట్ చేస్తుంది.

ఆ దగ్గు రెండు వారాల కంటే ఎక్కువసేపు ఉంటే… ప్రాణాంతకమైన క్షయ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మందులతో పనిలేకుండా… ఆయుర్వేదం, హోం రెమెడీస్ ని ఫాలో అయ్యి గొంతులో కిచ్ కిచ్ ను తరిమికొట్టొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి… కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు. గొంతులో హాయిగా అనిపిస్తుంది కూడా.

అల్లం పేస్ట్ కు, దాల్చిన చెక్కను పొడిని యాడ్ చేసి వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే తప్పకుండా చక్కని ఫలితం కనిపిస్తుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.

అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి… అల్లాన్ని మెత్తగా నూరి… టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే ఉంటుంది చూడండి… గొంతులో కిచ్ కిచ్‌కు రిలీఫ్ దొరుకుతుంది.
పుదీనా చేసే మేలేంటో ఆల్రెడీ చాలామందికి తెలుసు. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి… ఆకులు తీసివేసి… వాటర్ తాగాలి. ఒకవేళ పుదీనా ఆకులు లేకపోతే తులసి ఆకులతో ఇలా ట్రై చేసినా మంచి ఫలితం ఉంటుంది.
కొన్ని చామంతి పువ్వుల రేకుల్ని నీటిలో వేసి… మరిగించి తాగాలి. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ చామంతి టీ బ్యాక్టీరియాను బయటకు పంపేయడంలో ది బెస్ట్ అంటారు.