కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా..?

Do you know how to reduce anger,how to reduce anger,Anger Management,Anger Management Techniques,reduce anger,Angry, Rest,Yoga, tension,Mango News,Mango News Telugu,How to Control Anger,Controlling anger,Anger management tips,Anger and disappointment,Effective Tips to Control Anger,Keep Your Anger Under Control,Anger Management News,Tips for defusing anger
Anger Management,Anger Management Techniques, how to reduce anger,Angry, Rest,Yoga, tension

మనిషి అన్నాక అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. అందులో ఒకటిగా చెప్పే కోపం రకరకాల కారణాల వల్ల వస్తుంది. అయితే,  మన శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులతోనే కోపం వస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కోసారి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తూంటుంది. అయితే   ప్రతిసారీ కోపం తెచ్చుకోవడం వల్ల పక్కనున్న మనుషులతోనే కాకుండా మన శరీరానికి కూడా ప్రమాదమేనట.

అందుకే  మితిమీరిన కోపం ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుందన్న విషయం తెలుసుకుని  దానిని కంట్రోల్ చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ యాంగర్ మేనేజ్మెంట్ అవసరమేనని.. కొన్ని చిట్కాలతో కోపాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు.

కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకుంటా ఉంటేనే మంచిది. లేదంటే  మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. కోపం తెచ్చుకోవడం క్షణంలో పనే కానీ.. దాని వల్ల జరిగే పరిణామాలు ఒక్కోసారి సరిదిద్దుకోలేనివిగా ఉంటాయి. అందుకే కోపంలో ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి లేదంటే కాసేపు మౌనంగా ఉండిపోవాలి.

మీరు కాస్త స్థిమిత పడ్డాక.. మీ ఆందోళనను, కోపాన్ని అవతలివారి ముందు బయటపెట్టండి.అంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండి.. ఆ తర్వాత మీకు కలిగిన  నిరాశ, ఆందోళనను అవతలి వ్యక్తులకు తెలియజేయండి. అలా చేస్తే ఇతరులు మిమ్మల్ని  అర్ధం చేసుకుంటారు. అనవసర మాటలు,గొడవలనుంచి బయటపడొచ్చు.

అలాగే ప్రతీ రోజూ వ్యాయామం చేయాలి. అలాగే కోపం వచ్చినప్పుడు  కూడా వ్యాయమం బెస్ట్ మెడిసిన్ అంటారు నిపుణులు. ఎందుకంటే శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కోపం పెరుగుతున్నట్లు అనిపిస్తే, వేగంగా నడవండి లేదా పరుగెత్తడం చేయాలి.లేదా ఇంట్లో ఉన్నారనుకోండి వెంటనే ఇంటి పనులు ఏదొకటి చేయండి. నిజానికి మామూలు సమయంలో చేసే పనుల కంటే కోపంతో ఉన్నప్పుడు చేసే పనులు చాలా వేగంగా ఉంటాయని దీని వల్ల పనులు కూడా చాలా వేగంగా పూర్తవుతాయని నిపుణులు అంటుంటారు.

మరీ రెస్ట్ లెస్ అయినా కూడా కోపం వస్తుంది. అందుకే ఒత్తిడితో అనిపిస్తే వెంటనే కొంచెం ఆ పనికి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇష్టమైన మ్యూజిక్ కానీ ఇష్టమైన బుక్ చదవడం వంటి పనులు చేసుకోండి. గార్డెనింగ్, పెట్స్‌తో సమయం గడపడం కూడా మనసుకు ఆహ్లాదాన్ని పంచి కోపాన్నిదూరం చేస్తాయి.అంతేకాదు యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయడం, రివర్స్‌లో అంకెలు లెక్కపెట్టడం,ఫజిల్ సాల్వ్ చేయడం ఇలాంటివన్నీ కూడా యాంగర్ మేనేజ్మెంట్‌కు ఉపయోగపడేవే.

ఎప్పుడూ కూడా కోపాన్ని క్యారీ చేయకండి. అది అవతలి వ్యక్తిని కంటే మీ  మనసుకు, శరీరానికే ఎక్కువ కీడును చేస్తుంది. అందుకే  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బాధపడితే వెంటనే సారీ చెప్పండి. ఇది ఇద్దరి శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిది. లేదంటే పగలు పెంచుకోవడం,దీనివల్ల  ఒత్తిడిపెరిగి  మరింత కోపం రావడం జరుగుతాయి.దీనివల్ల శరీరంలో చెడు హార్మోన్స్ రిలీజయి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − one =