ఆలుతో చేసిన వంటకాలంటే బాగా ఇష్టమా? అయితే ఒక్క క్షణం ఇది చదవండి..

Do You Love Dishes Made With Potatoes But Take A Moment To Read This,Cancer,Does Eating Potatoes Cause Cancer?,Eating Potatoes Cause Cancer?,Otatoes,Potatoes Are Bad For Health,Mango News,Mango News Telugu,Health Tips,Food,Meals,Health Tips Telugu,Healthy Eating Tips,Healthy Eating Benefits,Health Care,Fitness,Diet Tips,Health Tips Telugu,Simple Diet,Fitness Tips,Lifestyle News In Telugu,Healthy Eating And Diet,Health Tips Eating,Potatoes,What Happens to Your Body When You Eat Potatoes,The Problem With Potatoes,Potato Side Effects,Side Effects Of Potato,Potatoes Unhealthy,Cancer Risk

మారిన జీవనవిధానానికి తగినట్లుగా మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు , ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తినకుండా ఉంటే ముందుగానే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చాలామంది ఇష్టం తినే కూర ఆలుగడ్డ. రుచితో పాటు ఈజీగా అయిపోయే కర్రీ కాబట్టి చాలామంది బంగాళాదుంపల కూర చేయడానికి ఇష్టపడతారు. దీనికితోడు ఆలూ సమోస, ఆలూ బజ్జీ, ఆలూ పరోటా వంటి ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ అంటే అన్ని వయసుల వారికి మక్కువే. అయితే ఇలాంటి ఆలుగడ్డను ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆలుగడ్డలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూరల్లో కంటే ఆలుగడ్డను స్నాక్స్ రూపంలో తీసుకున్న వారిలో ఎన్నో సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారు. ఆలుగడ్డలు పిండి పదార్థం ఎక్కువగా ఉండే దుంప జాతికి చెందడంతో.. వండే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. తాజాగా బంగాళాదుంపలు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

బంగాళా దుంపలలో ఆక్రిలామైడ్ అనే రసాయనం ఉంటుంది. కాబట్టి వీటిని చక్కెర తో తీసుకున్నా.. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాల్చినా కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అందుకే డీప్ ఫ్రైలు వంటి వంటికి దూరంగా ఉండాలని, ఎక్కువ సేపు ఎక్కువ ఉష్ణోగ్రతలతో వీటిని కుక్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..నిద్ర అనేది కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రొమ్ము, పెద్దప్రేగు, అండాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు రాకుండా చేయడంలో నిద్ర పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు క్యాన్సర్‌ను నివారించే ఆహార పదార్ధాలు తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ఎన్నో జబ్బులు రాకుండా చేయొచ్చంటున్నారు.