తినే ఆహారాల్లో రుచిని పెంచడానికి చాలామంది మిరియాలను రోజూ వాడతారు. వంటకాల్లో మిరియాలు వేస్తే మంచి వాసనతో పాటు రుచి కూడా పెరుగుతుంది. అంతే కాదు జలుబు, దగ్గు, గొంతు గర గర, ముక్కు దిబ్బడ, అజీర్తికి ఇలా అనేక వ్యాధులకు మిరియాలను ఔషధంగా వాడతారు. నల్ల మిరియాల కషాయం ఆరోగ్యానికి మేలు చేస్తుందని రెగ్యులర్ గా తీసుకుంటారు. అయితే నల్ల మిరియాలు మరీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంతమంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నల్ల మిరియాలు ఎక్కువగా తీసుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవి అధిక వేడిని కలిగిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడపులో వేడి పెరుగుతుంది. దీంతో అసిడిటి, గ్యాస్, పైల్స్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు వీటిని తీసుకోవడం మానేయాలి. గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవడం వల్ల అధిక వేడి కలుగుతుంది. దీంతో గర్భీణీలకు ఇబ్బంది ఉంటుంది. బాలింతలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా నల్ల మిరియాలను పరిమిత సంఖ్యలో తీసుకోవాలి.
ఆస్తమా రోగులు నల్ల మిరియాలు ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల .. నల్ల మిరియాలు పచ్చిగా ఉండడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు హానికరంగా ఉంటాయి. అలాగే వీటివల్ల శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు నల్ల మిరియాలను తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ల సలహాతోనే తీసుకోవాలి.
నల్ల మిరియాలు అధికంగా తీసుకోవడం వలన చర్మం పొడిగా మారుతుంది. ఇవి వేడిని కలిగించడమే కాకుండా..చర్మంలోని తేమను తీసివేస్తుంది. ఇప్పటికే చర్మం పొడిగా ఉన్నవారు వీటిని తీసుకోవద్దు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన చర్మం దద్దుర్లు వస్తాయి. వీటి వలన చర్మం మొటిమలు, దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే డైలీ కాకుండా వారానికి రెండు, మూడు సార్లు నల్ల మిరియాలను వాడితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.