పింక్ సాల్ట్ , టేబుల్ సాల్ట్ మధ్య తేడాలున్నాయా?

What Are the Differences Between Pink Salt And Table Salt, Differences Between Pink Salt And Table Salt, Pink Salt And Table Salt Differences, Pink Salt And Table Salt, Pink Salt, normal Salt, Rock Salt, Sodium, Pink Salt And Table Salt Differences Health News, Latest Facts About Pink Salt And Table Salt, Health Facts, Health Tips, Health News, Mango News, Mango News Telugu
Pink salt, normal salt , differences between pink salt and table salt,Rock Salt, Sodium,

కరోనా తర్వాత చాలామంది కుటుంబం ఆరోగ్యంతో పాటు, వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భాగంగానే షుగర్ నుంచి సాల్ట్ వరకూ తినే కూరగాయల నుంచి తాగే పాలు  వరకూ అన్ని సేంద్రియ, సహజ సిద్ధమైన  వాటిని తినడానికి , తాగడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే సాధారణ  ఉప్పు వాడటానికి  బదులు ఇప్పుడు చాలామంది రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్‌ అంటూ వాడుతున్నారు.

రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ వంటివి ఎక్కువ మంది వాడటం వల్ల.. వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు వాటి అమ్మకాలు కూడా పెరిగాయి. అయితే, ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ ..టేబుల్ సాల్ట్, సీ సాల్ట్ కంటే హెల్దీ కాదని  నిపుణులు చెబుతున్నారు.  పింక్ హిమాలయన్ ఉప్పు గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి.

ఈ ఖనిజాలు మొత్తం శరీరంలో పోషకాలను తీసుకోవడానికి దోహదం చేస్తాయి.నిజానికి హిమాలయన్ పింక్ సాల్ట్‌కు,  టేబుల్ సాల్ట్ మధ్య అసలు తేడాలే లేవని  అంటున్నారు.  ఈ ఉప్పు ద్వారా హిమాలయ శిలలను ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో దుష్ప్రభావాలకు దారి తీస్తుందట. శరీరంలోని కణాలకు పోషకాలను తీసుకువెళ్లే  ఎలక్ట్రోలైట్లతో పాటు ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడానికి మనిషికి  ఉప్పు అవసరం ఉంటుంది.

నిజానికి అన్ని లవణాలలో సోడియం ఉంటుంది. కొన్ని ఉప్పులో అదనపు ఖనిజాలు ఉంటాయి. అందుకే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రోజుకు 2,300 మిల్లీగ్రాముల సోడియం తీసుకోవాలని చెబుతోంది. కానీ సగటు పెద్దలు మాత్రం రోజుకు 3,393 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును వినియోగిస్తారు. కాబట్టి కావాల్సినదాని కంటే ఎక్కువ మోతాదులో ఎలాంటి ఉప్పును తీసుకున్నా అది ప్రమాదానికి దారి తీస్తుంది.  అది పింక్ శాల్ట్ అయినా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇందులో వైట్ టేబుల్ సాల్ట్‌తో పోలిస్తే మాత్రం.. ఇందులో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది.

హిమాలయన్ పింక్ సాల్ట్ కిలో ప్యాకెట్ రూ.80కి మార్కెట్లో దొరుకుతుంది. ఈ హిమాలయ పింక్ సాల్ట్‌ను పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో తవ్వుతారు. ఇప్పుడు చాలామంది పింక్ సాల్ట్  మంచిదని కాస్ట్ ఎక్కువ అయినా  కూడా అదే వాడుతున్నారు.నిజానికి సాధారణ టేబుల్ సాల్ట్‌తో పోలిస్తే హిమాలయన్ పింక్ సాల్ట్‌లో ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటి వరకూ ఏ పరిశోధన కూడా నిరూపించలేదని నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =