గ్రామాలలో ప్రతీ ఇంట్లో కనిపించే రణపాల మొక్క.. ఔషధాల గని. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులు నుంచి , కాండం, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. ఈ రణపాల మొక్కలు ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇది తరచుగా వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. రణపాల ఆకులను డైరెక్ట్ గా తినొచ్చు లేదా కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు.
షుగర్ పేషెంట్స్ కూడా ఈ రణపాల కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను కషాయంగా చేసుకొని తింటే వారిలో క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి.దీనివల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా తగ్గిపోతాయి.
ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని దెబ్బలు తగిలిన చోట, పుండ్లు వచ్చిన చోట ఈ పేస్టును రాస్తే గాయాలు తొందరగా మానిపోతాయి. రణపాల ఆకుల్లో బీపీని తగ్గించే ఔషధ గుణం కూడా ఉంది. హైబీపీతో బాధపడేవారు రణపాల ఆకుల కషాయాన్ని గనక తీసుకుంటే.. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాదు జీర్ణశయ్య సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా కడుపులో అల్సర్లు,అజీర్ణం,మలబద్దకం సమస్యలతో బాధపడేవారు ఈ రణపాల ఆకుల కషాయాన్ని తీసుకుంటే.. జీర్ణాశయ సమస్యలు తగ్గిపోతాయి.
కొంతమంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని తల పైన పట్టి లాగా పెట్టుకున్నట్లయితే మీ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే రణపాల ఆకులను తినడం ద్వారా లేదా కషాయం ద్వారా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలామంది ఆల్కహాల్ తరచూ తీసుకునే వారికి వారి కాలేయం దెబ్బతింటుంది. అలాంటివారు ఈ రణపాల కషాయాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
చాలామందిలో ఉండే మూత్ర సంబంధ సమస్యలకు రణపాల బెస్ట్ మెడిసిన్. వీరు రణపాల ఆకులు తినడం, రణపాల కషాయాన్ని తీసుకుంటే ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కామెర్లవాధితో బాధపడే వారు రణపాల ఆకుల రసాన్ని తీసుకుంటే త్వరగా ఆ వ్యాధి నయమవుతుందని ఆయుర్వేద శాస్త్రంలో తెలుపబడింది. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడంలో రణపాల ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉండడం వల్ల జలుబు, దగ్గు, విరోచనాలు వంటి సమస్యను తగ్గించడంలో కూడా రణపాల కషాయం సహాయపడుతుంది. మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు వచ్చిన వారు కూడా రణపాల కషాయాన్ని తీసుకుంటే వాటి నుంచి త్వరగా బయటపడొచ్చు.