ఒక గ్రూప్ రక్తానికి బదులు ఇంకో గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. పేషెంట్ ప్రాణాలు పోవడమేనా?

Red blood cells, white blood cells, platelets,When collecting blood,When transfusing blood,If One Group Of Blood Transfused Instead Of Another Group To The Patient What Happens,Group Of Blood Transfuse,Instead Of Another Group,What Happens To The Patient,Mango News, Mango News Telugu,Blood Transfusions,Blood Transfusion,Matching Blood Groups,Blood Groups,Blood Types,Blood Groups And Transfusions,Mismatched Blood Transfusion,Mismatched Blood Transfusion Causes

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అర్జంటుగా B పాజిటివ్ బ్లడ్ కావాలి అని ఆస్పత్రి సిబ్బంది చెప్పడం, లేదా వాట్సాప్ స్టేటస్‌లు మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం . కొన్నిసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్లకు టెస్ట్ చేసి వారి బ్లడ్ గ్రూప్ నిర్ధారించుకున్న తర్వాతే వారి బ్లడ్ ను సేకరిస్తుంటారు. ఒకదానికి బదులు మరొక గ్రూప్ రక్తాన్ని పొరపాటున కూడా ఎక్కించరు. ఇలాంటప్పుడే చాలామందికి ఒక అనుమానం వస్తుంటుంది. ఒకవేళ పొరపాటున ఒక గ్రూప్‌కు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే ఏమౌతుంది అని. నిజమే ఈ అనుమానం చాలామందిలో వస్తుంటుంది.

మనిషి శరీరంలో ఉండే రక్తంలోని ప్లాస్మాలో.. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు,ప్లేట్‌లెట్స్ కలిసే ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఆధారంగా లభించే యాంటీజన్ ప్రకారం మనిషి బ్లడ్ గ్రూప్ ఏదనేది నిర్ధారిస్తుంటారు. నిజానికి బ్లడ్ గ్రూప్ అనేది తల్లిదండ్రుల నుంచి డీఎన్ఏ ద్వారా పిల్లలకు కూడా వస్తుంది. అంటే పిల్లలకు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి బ్లడ్ గ్రూప్ వారసత్వంగా వస్తుంది. సాధారణంగా రెడ్ బ్లడ్ సెల్స్‌లో రెండు రకాల యాంటీ జెన్‌ లు ఉంటాయి. ఇవి యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి. రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటే బ్లడ్ గ్రూప్ కూడా ఏ అవుతుంది. యాంటీజెన్ బీ ఉంటే.. వారి బ్లడ్ గ్రూప్ కూడా బీ గ్రూప్‌నే అవుతుంది. రెండూ కలిసి ఉంటే ఏబీ బ్లడ్ గ్రూప్ అవుతుంది. రెండూ లేకపోతే ఓ గ్రూప్ అవుతుందన్న మాట.. ఇలా బ్లడ్ గ్రూపులు నిర్ధారించబడతాయి.

ఎవరైనా పేషెంట్‌కు బ్లడ్ ఎక్కించేటపుడు.. ఒకవేళ ఒక గ్రూప్‌ రక్తానికి బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్యూట్ హెమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్ సంభవిస్తుంది. ఇలా జరిగితే టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగి తీవ్రమైన జ్వరం, బ్యాక్ పెయిన్స్, తీవ్రమైన వణుకు లక్షణాలు కన్పిస్తాయి. ఎప్పుడైనా ఓ మనిషి శరీరంలో మరో బ్లడ్ గ్రూప్ ఎక్కించినప్పుడు.. ఆ మనిషిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి.. ఆ రక్తాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు బయటపడతాయి. అయితే ఇలాంటి లక్షణాలు కనుక గుర్తిస్తే.. డాక్టర్‌ పర్యవేక్షణలో వెంటనే హెమోడైనమిక్స్ బ్యాలెన్స్ చేస్తూ చికిత్స అందించాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఎమర్జెన్సీ కేసు కిందే లెక్క.

ఇలా అవగాహన లేకుండానే.. కంగారులోనే, తెలియకుండానే చేసే తప్పుతో పేషెంట్ ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. అంతేకాదు ఒకదానికి బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఆ వ్యక్తి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్సేపటి తరువాత కిడ్నీలు రెండూ పూర్తిగా పనిచేయడం ఆగిపోవచ్చు. యూరిన్‌లో రక్తం, ఫ్లూ వంటి సమస్యలు, షాక్ తగలడం వంటి పరిస్థితులతో చనిపోయే పరిస్థితులు రావొచ్చు. అందుకే రక్తం ఎక్కించేటప్పుడు లేదా రక్తం సేకరించేటప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =