ఊబకాయం కంటే కూడా చాలామందిని వేధించే సమస్య బొజ్జ. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గకపోగా..చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటివారు ఉలవలు, ఎర్రకందిపప్పు, పెసరపప్పులు తరచూ తింటూ పొట్టలో కొవ్వు కరిగించేసుకోవచ్చని అంటున్నారు. రెగ్యులర్ గా ఇవి తింటూ ఉంటే… పొట్ట ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని చెబుతున్నారు.
ఉలవల వల్ల బరువు తగ్గడమే కాదు… ఓవరాల్ హెల్త్‌కి కూడా ఇవి చాలా మంచివి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలూ వీటిలో ఉంటాయి. ఉలవలు… పొట్టలో కొవ్వును తగ్గిస్తాయి. దీని వల్ల పొట్ట సైజ్ రోజురోజుకు తగ్గుతుంది. అంతేకాదు ఉలవలు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తాయి. అందువల్ల ఉలవల్ని రెగ్యులర్‌గా వాడితే పొట్ట తగ్గడంతో పాటు ఇతర లాభాలు కూడా పొందొచ్చు.
రకరకాల వ్యాధుల అంతు చూసే గుణం పెసరపప్పుకి ఉంది. ఈ పప్పు ఈజీగా అరుగుతుంది. దీని నిండా పోషకాలే. ఇది బరువు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల దీన్ని తింటే… ఇంకేమీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. ఇది పొట్ట సమస్యనే కాదు.. శరీర బరువు కూడా తగ్గేందుకు వీలు కల్పిస్తుంది
ఎర్రపప్పునే కొంతమంది మసరపప్పు అంటారు. మనం ఎప్పుడో గానీ వండుకోం కానీ ఈ పప్పు చాలా మంచిది. ఈజీగా జీర్ణం అవుతుంది. దీనిలో చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి బాడీకీ చాలా అవసరం. పైగా ఈ పప్పులో కొవ్వు తక్కువ. ఫైబర్ ఎక్కువ. పైన చెప్పుకున్నట్లు ఫైబర్ వల్ల ఈ పప్పు తిన్నాక… పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. ఇంకేమీ తినబుద్ధి కాదు. అందువల్ల పొట్ట సమస్య తగ్గుతూ ఉంటుంది.