
ప్రతి ఒకరికీ ఒత్తయిన జుట్టు ఉండాలనుకుంటారు. దీంతో ఎవరు ఏ చిట్కా చెప్పినా, ఏ ఆయిల్ పేరు చెప్పినా, ఎలాంటి ఫుడ్ తీసుకోమన్నా అస్సలు ఆలస్యం చేయకుండా పాటిస్తారు. కొంతమంది మార్కెట్లోకి వచ్చే ఎన్నో రకాల ప్రొడక్ట్ లను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. పైగా జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుందని బాధపడుతూ ఉంటారు. అయితే జుట్టు రాలడం తగ్గి త్వరగా ఒత్తైన జుట్టు పెరగాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఉసిరిలో ఉన్న కొల్లాజెన్ జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. అందువల్ల ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ కాకపోయినా తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉసిరి పొడిని నీటిలో కలిపి జుట్టుకు బాగా పట్టించి కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు రాలడం తగ్గి త్వరగా జుట్టు పెరుగుతుంది.
జుట్టు ఒత్తుగా పెరగాలనుకొనే వారికి అవిసె గింజలు ఎంతో దోహదపడతాయి. వీటిలో ఎక్కువగా ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఒక టేబుల్ టి స్పూన్ అవిసెగింజలలో సుమారుగా 6400 మిల్లీగ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయని పలు అధ్యయనాల ద్వారా తేలింది. ఎక్కువ మొత్తంలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్ ఉండడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రోజూ కొన్ని అవిసె గింజలను తిన్నా లేదంటే లేదా రోజుకొక అవిసెగింజల లడ్డు తిన్నా కూడా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
నిత్యం వంటలలో ఉపయోగించే కరివేపాకు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ మన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. అందువల్ల ప్రతి వంటకాల్లో కరివేపాకు ఉండేటట్లు చూడాలి. వీలయితే కరివేపాకును రోజూ తింటుండాలి. అలాగే కరివేపాకును పేస్ట్‌లా చేసి జుట్టుకు రాసి కొంతసేపు అయ్యాక తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుతుంది.
అలాగే ఉల్లిపాయ రసం జట్టుకు పట్టించి అరగంట తర్వాత తలకు స్నానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. హెయిర్ డై వాడేవాళ్లు మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ ప్రొడెక్టులు కాకుండా నేచురల్ గా తగ్గే మెహందీ లాంటివి వాడుతూ ఉండాలి. వీటితో పాటు ఒత్తిడికి దూరంగా ఉండేలా ధ్యానం, యోగా జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY