రక్త హీనత వదలడం లేదా? ఎనీమియాను ఇలా తరిమికొట్టండి..

Get Rid Of Anemia Like This, Get Rid Of Anemia, Anemia Does Not Stop, Get Rid Of Anemia, Hemoglobin, Sugar Levels, Iron Deficiency Anemia, Anemia Causes, Anemia Symptoms, Home Tips For Anemia, Anemia Treatment, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

సాధారణంంగా మన శరీరంలోని పెద్ద ఎముకల్లో హీమోగ్లోబిన్‌ తయారవుతుంది. శరీరంలో ఐరన్ తక్కువ ఉండటం వల్ల ఈ హీమోగ్లోబిన్‌ అనే ప్రొటీన్‌ తక్కువగా తయారవుతుంది. దీనివల్లే రక్తహీనత ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల.. శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు. ఆక్సిజన్‌ సరఫరా కాకపోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

చిన్న పనులకే త్వరగా అలసిపోవడం, మానసికంగా అలసిపోవడం, చిరాకుగా ఉండడం, బలహీనంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించటం , తరుచుగా తలనొప్పి వస్తుండటం, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు నడిచినా.. మెట్లు ఎక్కుతున్నా కూడా ఆయాసం వస్తుంది. రక్తహీనత ఉన్న వారు గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతుంటారు. చర్మం పాలిపోవటం, నాలుక పాలిపోయి ఉండడం, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, అరిచేతులు, అరికాళ్లు, గోళ్లు పాలిపోయినట్లు ఉండటం ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్‌ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

మాంసాహారులైతే మేక మాంసం, కోడి మాంసం, చేపలు తినాలి. ఆర్గాన్‌ మీట్స్, లివర్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ బి 12, జింక్, ఫాస్పరస్‌ అధికంగా ఉంటుంది. వీటిని మైక్రోవేవ్‌లో బేక్‌ చేసి తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఐరన్‌ లెవల్స్‌ని పెంచుతుంది. మాంసాహారం అలవాటు ఉన్నవారు బోన్‌ సూప్‌ తాగటం లాంటివి చేస్తుండాలి. దీని వల్ల ఎనీమియా తగ్గించే అవకాశం ఉంటుంది.

శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలను తొలగించడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది.అలాగే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను రోజూ తింటే శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.

డ్రై ఫ్రూట్స్ డైలీ లైఫ్ లో యాడ్ చేసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. ఖర్జూరాలు, బాదం, వాల్‌ట్స్ వంటి ఎండు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తీసుకోవడం వలన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే నువ్వులు, పల్లీలు బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముఖ్యంగా మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే మీరు తినే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా పాలకూరను చేర్చాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.