అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. చర్మంపై మృత కణాలు, పగుళ్లు ఏర్పడి చాలామందికి డ్రైగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ముఖ వర్ఛస్సు తగ్గుతుంది. దీంతో రకరకాల క్రీములు, పేషియల్స్ వాడటానికి ఇష్టపడతారు.అయితే తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతోనే ఫేస్ గ్లోయింగ్ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయలో విటమిన్ సీ, తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఓ గిన్నెలో తేనె, పాలు, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే..అప్పుడు ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బియ్యపు పిండి అద్భుతంగా పని చేస్తుందని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మొటిమలు, మచ్చలను తొలగించడంలో బియ్యంపిండి సహాయపడుతుంది. దీని కోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకొని, కొంచెం ఆముదం, కొన్ని పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేస్తే ముఖ వర్ఛస్సు పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో పసుపు, పెరుగు కూడా స్కిన్ గ్లోయింగ్ కోసం బాగా ఉపయోగపడతాయి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకు, అర టీ స్పూన్ పసుపు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేస్తే..ఫేషియల్ అవసరం లేకుండానే ఫేస్ నిగ నిగలాడుతుంది.