గులాబీ పూలతో ఆరోగ్యం

Health Even With Roses,Diseases Are Removed With Rose Flowers,Rose Flowers,Mango News,Mango News Telugu,Health Benefits Of Rose,Health Benefits Of Roses,Roses Health Benefits,Rose Tea,Health Tips,Health Facts,Beauty Tips,Rose Flowers,Rose Flowers Benefits,Health Benefits And Uses Of Rose Flower,Health Benefits Of Rose Petals For Skin,Best Use Of Rose,Health Benefits Of Rose Petals For Skin,Uses Of Rose Flower,Rose Flower Uses And Benefits,Rose Petals Benefits For Skin,Benefits Of Rose Plant In Home,Benefits Of Rose Petals,Health Tips In Telugu,Roses Health Benefits In Telugu,Rose Tea Health Benefits,Rose Water Health Benefits,Health Facts Of Roses,Beauty Tips With Flowers In Telugu,Health Benefits Of Eating Rose Petals,Rose Tea Recipe,Benefits Of Rose Tea

మనం ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహార పదార్ధాలే కాదు.. మన చుట్టూ వుండే పూలు కూడా చాలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పువ్వుల్లో అందమైన పువ్వుగా పేరున్న గులాబీ.. అందానికే కాదు ఔషధంగా కూడా మేలు చేస్తుందట. గులాబీలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గులాబీ పూలు చర్మపు చికాకును తగ్గించడానికి సహాయపడుతాయి. గొంతు నొప్పిని తగ్గిస్తాయి. చర్మం ఎరుపుదనాన్ని, కమిలినట్లుండే చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. అంటువ్యాధులను నివారించడానికి, చికిత్స చేయడానికి సహాయపడుతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. మచ్చలు, కాలిన గాయాలను నయం చేస్తాయి.

గులాబీ పువ్వు మానసిక స్థితిని దృఢపరుస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాకుండా… బాదంపాలతో గులాబీ రేకులు కలిపి తీసుకుంటుంటే రక్తపోటు తగ్గిపోతుంది. గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడటమే కాక జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయట. గులాబీ పువ్వుల నుంచి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుంచి తయారయ్యే రోజ్ వాటర్‌ను సౌందర్య సాధనంగా వాడతారు.

గులాబీ నుంచి తయారయ్యే గులాబీ గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడతారు. ప్రతిరోజు భోజనం తర్వాత చాలామందికి వక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది. వేసవి తాపం తీర్చుకునేందుకు 10 గ్రాముల లోపు ద్రవాన్ని ఒక్కసారి తీసుకుంటే మేలు కలుగుతుంది.

గులాబీ పువ్వులలో టానిన్లు, విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. అలాగే గులాబీ పువ్వుల జ్యూస్ శరీరంలోని వేడిని ఇంకా తలనొప్పిని తగ్గిస్తుంది. ఎండిన పువ్వులు గర్భిణీలలో మూత్ర విసర్జన సమస్యలను పూర్తిగా నయం చేస్తాయి. వాటి రేకులు కూడా కడుపులోని సమస్యలను వెంటనే తగ్గిస్తాయి.

ఇక గులాబీలను మురబ్బా వంటి స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తుంటారు. దగ్గు, ఉబ్బసం , బ్రాంకయిటిస్ వంటి ఉపరితిత్తుల సమస్యలు, అజీర్ణం, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను నయం చేయడంలో ఎంతగానో సహయపడతాయి. అలాగే రోజ్ వాటర్ వలన కళ్ల మంటను తగ్గించవచ్చు.