ఆరోగ్యానికి మేలని చాలా మంది ఉదయం లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగుతూ ఉంటారు. ఇది నిజంగా మంచి పనే. వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
అలాగే బరువు నియంత్రణలో ఉంటుంది. గొంతు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్లే ఆరోగ్య నిపుణులు కూడా వేడి నీళ్లు తాగమని చెబుతుంటారు. అయితే మంచిదన్నారు కదా అని కొందరు రోజంతా వేడి నీరే తాగుతారు.కానీ, ఇలా అతిగా వేడి నీళ్లు తీసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా వేడి నీటిని తరచూ తీసుకోవడం వల్ల తలనొప్పి, చికాకు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వేడినీళ్లు అస్సలు తాగొద్దు. ఇలాంటపుడు హాట్ వాటర్ తీసుకుంటే దాహం తీరదు.
తరచూ వేడి వేడిగా ఉండే నీరు తాగడం వల్ల గొంతులో కణాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకు రెండు లేదా మూడు సార్లు మించి వేడి నీళ్లను తీసుకోకూడదని అంటున్నారు.
అంతేకాదు, అతిగా వేడి నీళ్లను తీసుకుంటే మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కిడ్నీ చేసే సాధారణ ఫంక్షన్ ని ప్రభావితం చేస్తుంది. ఇక వేడి నీళ్లనే తరచూ తీసుకుంటే రక్త పోటు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
నెలల తరబడి వేడి నీళ్లు తాగితే అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఆయాసం, కడుపులో వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు వేడి నీరు తాగితే అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమయినా అతి ఎప్పుడూ మంచిది కాదన్న పెద్దల మాటను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలన్నది మరోసారి రుజువయింది.