మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడి లేకుండా ఉండటానికి ది బెస్ట్ మెడిసిన్ ధ్యానం అంటారు నిపుణులు. ఏకాగ్రతతో రోజూ ధ్యానం చేయడం వల్ల శరీరం, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మెడిటేషన్ చేసే వ్యక్తులు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కూడా ఒకేలా ఉంటారు. అయితే ధ్యానం ఎప్పుడూ ఏకాగ్రతతో .. సరైన పొజిషన్లో కూర్చుని చేయాలి.
కొందరు మనస్సులో ఏవేవో ఆలోచనలతో ధ్యానం చేస్తారు. ఇలా మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకుంటేనే ధ్యానం సాధ్యమవుతుంది. ఇది మొదట్లో కష్టంగా ఉన్నా తర్వాత ఈజీగా అలవాటు అయిపోతుంది. అలాగే శ్వాస తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మెడిటేషన్ చేయాలి.
ఏ పని చేసిన సరే ఇష్టంతో చేయాలి తప్ప కష్టంగా చేయకూడదని పెద్దలు అంటారు. అందులోనూ ధ్యానం ఏదో పని అయిపోయిందనే విధంగా కాకుండా ఇష్టంగా చేయాలి. ఆ ధ్యానం మీద మీకు ఒక గౌరవం ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత తప్పనిసరిగా ఉండాలి. అలాగే కళ్లు మూసుకుని కంఫార్ట్ ఉన్న భంగిమలో కూర్చోని ధ్యానం చేస్తూ..కేవలం శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉండాలి. ఇలా ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల చాలా స్ట్రాంగ్‌గా మారుతారు.
బౌద్ధమతానికి సంబంధించిన జెన్ ధ్యానం చేసేటప్పుడు ఒకే ప్లేస్‌లో కదలకుండా కూర్చోని.. శ్వాసపైన ధ్యాస పెట్టాలి. శ్వాస శరీరంలో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ప్రేమపూర్వకంగా , దయతో ధ్యానం చేయాలి. అంటే ఎవరి మీద కూడా కోపం, ద్వేషం వంటివి పెట్టుకోకుండా ఉంటామని మనసుకు చెప్పుకుంటూ ధ్యానం చేయాలి.
ఏకాగ్రతగా ధ్యానం చేయడడానికి ఏదొక మంత్రాన్ని జపిస్తే మంచిది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీతో కొంత శక్తి లభిస్తుందన్న అనుభూతి వస్తుంది అలాగే త్వరగా ఏకాగ్రత కుదురుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారే ఎక్కువగా ఈ మంత్ర ధ్యానాన్ని చేస్తుంటారు.