ప్రతీరోజూ ఉదయం లేచిన వెంటనే ఉప్పు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటు ఊపిరి తిత్తులకు కూడా ఇవి మంచిదని అంటున్నారు. ఉదయాన లేచి పరగడపున ఉప్పునీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని యాసిడ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని ..అంతేకాకుండా ఇంకా చాలా లాభాలున్నాయంటున్నారు.
ఉప్పు ప్రతీ ఒక్కరి ఆహారంలో ముఖ్యమైన భాగం అయిపోయింది. అతిగా ఉప్పు తినడం ప్రమాదం కాబట్టి..ఇటీవల దీని వాడకాన్ని కాస్త తగ్గించారు. అయితే రోజూ ఉదయం పరగడపున గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు కలిపి ఆ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజూ ఉదయం పరగడపున గోరువెచ్చని ఉప్పు నీళ్లు తాగితే రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉండటంతో శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ప్రభావవంతంగా ఉంటుంది. నీటిలో ఉప్పు కలిపి రోజూ తాగితే కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
ఉదయాన్నే ఉప్పునీరు తాగితే జీర్ణవ్యవస్థలోని యాసిడ్ బ్యాలెన్స్ అయ్యి.. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించడంతో.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు మొదలైన ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఈ నీళ్లు సహాయపడుతాయి. అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది.
ఉప్పునీరు మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది అలాగే చుండ్రును కూడా తొలగిస్తుంది. ఈ ఉప్పునీరు మూత్రపిండాలు,కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే మంచిదే కదా ఎక్కువ శాతంలో ఉప్పు వేసుకుని తాగితే అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
, ,