ఇప్పుడు విటమిన్ డి లోపం అందరిలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా ఆఫీసులో ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.నిజానికి మనకు కావాల్సిన విటమిన్ డి అంతా సూర్యరశ్మిలోనే దొరుకుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి ని మన శరీరానికి దూరం చేస్తున్నాం. అందుకే సూర్యరశ్మి శరీరానికి ఏ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు.
ఉదయం సమయంలో ఎండలో నిలబడటానికి వీలు కాకపోతే .. సాయంత్రం ఎండలో కూర్చోవచ్చు. సూర్యరశ్మి ఉదయం, సాయంత్రం రెండింటిలో కూడా ఒకే ప్రయోజనాలను ఇస్తుంది. శాతాకాలంలో పావుగంట కంటే కూడా ఎక్కువ సేపు ఉండటం మంచిది. అలాగే ఎండలో నిలబడేముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే ఎక్కువ ఫలితం ఉంటుంది. నీళ్లు తాగి నిలబడటం వల్ల శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉంటుంది.
శరీరంలో విటమిన్ డి లోపాన్ని నివారించాలనుకునేవాళ్లు సూర్యరశ్మిని తీసుకోవడం చాలా అవసరమని చెబుతున్న డాక్టర్లు… దీని కోసం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య 10 నుండి 15 నిమిషాల పాటు కానీ.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఎండలో నిలబడాలని అంటున్నారు. ఈ సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి కావాల్సిన మొత్తం విటమిన్ డిని పొందొచ్చని అంటున్నారు. సూర్యరశ్మి శరీరంలోని ఇతర భాగాలపై పడేలా ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ శరీరం కూడా ఫిట్‌గా మారుతుంది.
విటమిన్ డి కోసం సూర్యకాంతితో పాటు ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ డి కోసం పాలు, పెరుగు రెగ్యులర్‌గా తినాలి. అంతే కాకుండా వింటర్ సీజన్ లో అయితే మీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నాన్ వెజ్ తినేవారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ ఫిష్ ఎక్కువ తినాలి. ఎందుకంటే ఇది విటమిన్ జికి మంచి మూలం.మామూలు చేపల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాకపోతే కాస్త తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుడ్లు కూడా రోజూ తినాలి.