మయోఫియా లక్షణాలు ఎలా ఉంటాయి?

What are the symptoms of myofia,symptoms of myofia,myofia disorder,Eye Disorder,many eye diseases arise,South Korea, Taiwan, Singapore,Japan,Problem of myophia, squinting, eye strain,Symptoms and causes,Myopia Signs and Symptoms,Mango News,Mango News Telugu,Myofia Latest News,Myofia Latest Updates,Myofia Live News,symptoms of myofia News Today
Eye Disorder,many eye diseases arise,South Korea, Taiwan, Singapore,Japan,Problem of myophia

దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ఇప్పుడు మయోఫియా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇండియాలోనూ విస్తరిస్తోండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మయోఫియా అనేది కంటికి సంబంధించిన రుగ్మతగా డాక్టర్లు చెబుతున్నారు.ఇప్పుడు  ప్రతీ పని కోసం టెక్నాలజీ సాయాన్ని కోరాల్సి వస్తుంది. దీనికి తోడు చాలామంది మొబైల్ పైనే ఆధారపడుతున్నారు. దీంతో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయి.. దీని ఫలితంగా కళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్లే ఎన్నో  కంటి జబ్బులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇలాగే  కంటికి సంబంధించి జబ్బు అయిన ‘మయోఫియా’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది మొదట్లో చిన్నగా అనిపించినా.. ఆ తరువాత కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని డాక్టర్లు అంటున్నారు

దీంతో అసలు మయోఫియా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మయోఫియా పేరు మొన్నటివరకూ ఎక్కువగా దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, జపాన్ వంటి దేశాలలోనే  ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు ఇండియాలోనూ చాపకింద నీరులా విస్తరిస్తుండటమే ఆందోళన కలిగించే విషయం. మయోఫియా అనేది కంటికి సంబంధించిన ఒక జబ్బు. మయోఫియా ఉన్న వారు దూరంగా ఉన్న వస్తువులను అసలు చూడలేరు.  చిన్న పిల్లల్లోనే ఎక్కువగా మయోఫియా కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ముందుగా దీనిని  గుర్తించి కళ్లద్దాలు తీసుకున్నా కూడా ఈ పెద్ద రుగ్మత నుంచి కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం కూడా పడొచ్చు. కానీ ఒక్కోసారి ఇది రిపీట్ కూడా అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

మయోఫియా  వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు అంటున్నారు. ప్రారంభంలో  దూరంగా ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి.  ఏదైనా ఒక వస్తువును అదే పనిగా చూస్తే కళ్లపైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. చదువుకునే విద్యార్థుల్లో మయోఫియా వస్తే..  క్లాస్ బోర్డుపై ఏం రాస్తున్నారో కూడా వాళ్లు చూడలేరు. రాత్రి సమయంలో అయితే వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి.  తరుచూ కను రెప్పులు కొట్టుకోవడం కనిపిస్తే మయోఫియా రుగ్మత ఎంటర్ అయినట్లే.  ఎక్కువగా కంప్యూటర్ స్క్రీన్స్ ముందు కూర్చునేవాళ్లు, మొబైల్‌తో ఎక్కువ సమయం గడిపేవాళ్లు, బుక్స్‌ను  దగ్గరగా పెట్టి చదివేవాళ్లలో ఎక్కువగా మయోఫియా ఏర్పడే అవకాశం ఉంది.

మయోఫియాను డయోప్ట్రెస్ ఆప్టికల్ యూనిట్లలో కొలుస్తారు. మయోఫియా సమస్య రాకుండా ఉండటానికి  కంటికి సంబంధించిన  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలను ప్రతీ రోజూ ఎక్కువగా తీసుకోవాలి. కంప్యూటర్ ముందు కూర్చేని పనిచేసేవాళ్లు.. కనీసం అరగంటకు ఒకసారి  అయినా బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చిన ప్రతీసారీ 5 నుంచి 10 నిమిషాల పాటు కళ్లకు సంబంధించిన ఎక్సర్‌సైజులు చేయడం మంచింది. అలాగే రాత్రి పూట  మొబైల్ ను ఎక్కువ సేపు చూడకుండా ఉండాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + six =