జ్వరం ఉన్నప్పుడు చాలామంది చికెన్ తినడానికి భయపడతారు. అలా తింటే పచ్చకామెర్లు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజానికి కరోనా వచ్చిన తర్వాత చికెన్ ప్రధాన ఆహారంగా మారిపోయింది.కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రం చికెన్ తినకూడదని కొంతమంది చెబుతారు.
అయితే జ్వరం ఉన్నప్పటికీ తినాలనిపిస్తే చికెన్ తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైగా ఆ సమయంలో చికెన్ తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుందని అంటున్నారు. చికెన్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ తినకూడదని చెప్పడానికి మరో కారణం ఉందంటారు పెద్దలు. ఆ సమయంలో శరీరం బలహీన పడడం వల్ల జీర్ణక్రియ కూడా నీరసపడి.. జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే చాలామంది చికెన్ తినడానికి భయపడతారు.
అయితే జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలకున్నవారు.. కారాన్ని, మసాలాను తగ్గించి తీసుకోవాలి. అలాగే ఫ్రైలు కాకుండా..బాగా ఉడకబెట్టి వండి తింటే ఆరోగ్యానికి మంచిది. లేదంటే చికెన్ సూపును తిన్నా కూడా మంచిదే. ఎందుకంటే ప్రోటీన్, ఫైబర్‌తో నిండుగా ఉండే ఈ చికెన్ సూప్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చికెన్ తినడానికి పచ్చకామెర్లు రావడం అనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ కూడా ఉంది కాబట్టి ఎంచక్కా దీనిని తినొచ్చు. కాకపోతే బయట నుంచి తెచ్చుకున్నది కాకుండా ఇంట్లో తయారు చేసుకుని తింటే మంచిది.