కరోనా తర్వా చాలా మంది ఆరోగ్యంపై కేర్ తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో మునపటి కంటే ఎక్కువ ఇబ్బందులు తలెత్తడంతో పాటు.. వాతావరణ కాలుష్యం. నాణ్యమైన ఆహారం లభించకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక పదార్థాలను తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.అయితే కాస్ట్లీ పండ్లు, కాయలు తినేకంటే కీరా దోస తింటే చాలని నిపుణులు అంటున్నారు. దీనిలోనే మనిషికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయంటున్నారు.
మార్కెట్లో అందుబాటులో ఉండే కీర దోసలో ఊహించనన్ని పోషకాలు ఉంటాయి. కానీ చాలామంది ఇవి మార్కెట్లో కనిపించినా పెద్దగా పట్టించుకోరు. అయితే కుకుంబర్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తేమాత్రం అస్సలు విడిచిపెట్టరని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు ఇందులో ఉంటాయని ..తప్పనిసరిగా డైలీ వీటిని తీసుకుంటే ఆరోగ్యం మీ చేతిల్లోనని అంటున్నారు.
మార్కెట్లో ఎప్పటికీ లభించే కీర దోసలో విటమిన్ A,విటమిన్ C, విటమిన్ K, విటమిన్ B ఉంటాయి. కీర దోసను తీసుకోవడం వల్ల కళ్లకు చాలా మంచిది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనిషికి తక్షణ ఎనర్జీ వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగాలంటే కీర దోస మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇక చాలా మందికి విటమిన్ బి లోపంతో బాధపడేవారికి కుకుంబర్ బెస్ట్ అని చెప్పొచ్చు.
కీర దోసలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలున్న కీరాను తీసుకోవడం వల్ల శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా అధిక బరువుతో బాధపడేవారు.. ఈ బరువు తగ్గడానికి కీర దోస మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. కడుపు నిండినట్లు ఉండటంతో ఇతర ఆహారపదార్ధాలు తినాలన్న కోరిక ఉండదు.
రెగ్యులర్ గా కీరాను తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి కూడా బయపడొచ్చు. కుకుంబర్ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రక్తకణాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా కీరా చూసుకుంటుంది. కొందరు సాయంత్రం భోజనానికి బదులు ఇతర టిఫిన్లు చేస్తుంటారు. కానీ వాటికి బదులు కుటుంబర్ ను తీసుకోవడం మంచిది. మెదడులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కీర దోస పరిష్కరిస్తుంది. బాడీలో హీటు ఉండేవారు కీరదోస తినడం వల్ల శరీరం చల్లబడుతుంది.సలాడ్స్ లో కీరాను యాడ్ చేసుకుని తింటే ఒబెసిటీకి ఈజీగా చెక్ పెట్టొచ్చు.