నాభి అనగానే అందరికీ సినిమాల్లోని హీరోయిన్లే గుర్తుకు వస్తారు. నాభి అంటే అందమే కాదు.. దాని దగ్గర చేసే ఆయుర్వేద చికిత్సతో ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, జలుబు, మహిళల నెలసరి సమస్యలు వంటి అనేక సమస్యలకు దీనితోనే చెక్ పెట్టొచ్చంటున్నారు. నిజానికి బొడ్డు మన శరీరంలో 72వేల సిరల ద్వారా ప్రతి అవయవానికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల బొడ్డులో నూనె వేసి చికిత్స చేస్తే నరాల చివరలు ఉత్తేజంగా మారుతాయి. దానికి చికిత్స చేయటం ద్వారా ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.
ఏఏ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
కొన్ని చుక్కల కొబ్బరినూనె నాభిలో వేసి 5 నిముషాలు మసాజ్ చేస్తే పెదాలు పగలడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాక ఆడవారి నెలసరి సమస్యలకు మంచి రెమిడీ అని ఆయుర్వేదం చెప్పుతుంది.
ఆల్కహాల్‌లో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెడితే ఫ్లూ జ్వరం తగ్గుతుంది. జలుబు, దగ్గు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.బ్రాందీలో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెట్టుకుంటే స్త్రీలకు నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.వేప నూనెను బొడ్డులో పోసి మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది.
బాదం నూనెను బొడ్డులో వేసి మసాజ్ చేసిన కూడా ముఖ వర్చస్సు పెరిగి ముఖం ప్రకాశవంతముగా మారుతుంది.కొన్ని చుక్కల ఆలివ్‌నూనెను బొడ్డులో వేసి మర్దనా చేస్తే స్త్రీలకు సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది. అదే పురుషులకైతే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.ఆవు నెయ్యి కొద్దిగా తీసుకుని దాన్ని బొడ్డులో వేసి మసాజ్ చేస్తుంటే చర్మం మృదువుగా మారటమే కాకూండా మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
జాగ్రత్తలు..
నాభిలో సున్నితంగా మసాజ్ చేయడానికి 2-3 చుక్కల నూనెను మాత్రమే ఉపయోగించాలి. బొడ్డును చాలా గట్టిగా నొక్కవద్దు. నూనెను వేశాక సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల పాటు మసాజ్ చేస్తే చాలు. రోజుకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది.