
మన శరీర ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. వీటిలో విటమిన్ ఎ, బి, సి, డి వంటి విటమిన్ల గురించి మనం తరచుగా వింటుంటాం. అయితే విటమిన్ పి అనే ఒక రకమైన విటమిన్ కూడా ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ విటమిన్ శరీరంలో లోపిస్తే కూడా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుకే అన్ని విటమిన్లతో పాటు.. విటమిన్ పి ఉన్న ఆహారాలను కూడా మన డైలీ రొటీన్ ఆహార పదార్ధాలలో తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి..ఏఏ ఆహారంలో విటమిన్ పి దొరుకుతుందో తెలుసుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.
నిజానికి ఫ్లేవనాయిడ్లను కూడా విటమిన్ పి అని అంటారు. ఫ్లేవనాయిడ్లు అంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఒక ఫైటో న్యూట్రియంట్ అని డాక్టర్లు చెబుతున్నారు ఈ విటమిన్ పి అనేది ఎక్కువగా మొక్కల నుంచి దొరికే ఆహారాలలో కనిపిస్తుంటుంది. విటమిన్ P ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే మీ రక్తనాళాల పని తీరుని బాగు పరుస్తుంది. అంతేకాకుండా విటమిన్ పి అనేది యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. అలాగే ఆస్తమా, కీళ్లనొప్పులు, అలర్జీలను నివారించడంలో విటమిన్ పి పాత్ర ముఖ్యమైనది. విటమిన్ పి నిమ్మకాయలలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోజూ నిమ్మరసం తాగడం, తినే ఆహార పదార్ధాలలో నిమ్మ రసం పిండుకుని తినడం వంటివి చేయాలి.
హై క్వాలిటీ.. డార్క్ చాక్లెట్‌లో కూడా విటమిన్ పి లభిస్తుంది. బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్‌లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రెడ్ వైన్, ఆకుకూరలుతో పాటు సోయా ఉత్పత్తులు, ద్రాక్ష, సోయాబీన్స్ వంటి వాటిలో విటమిన్ పి ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY