మన దేశంలో ఆస్తి తగాదాలు జరగడం చాలా అంటే చాలా సాధారణంగా చూస్తుంటాం. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి గురించో, తల్లిదండ్రుల ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనో వారసులు గొడవలు పడుతూ చివరకు కోర్టు మెట్లు కూడా ఎక్కుతూ ఉంటారు. నిజానికి భారతదేశంలో ఆస్తి పంపిణీకి.. చాలా స్పష్టమైన చట్టాలున్నాయి. దీని ద్వారారే ఆస్తి పంపకాలు జరుగుతూ ఉంటాయి.
కాకపోతే చట్టాలు, సెక్షన్లు వంటివి చాలామంది పట్టించుకోరు. వాటితో మనకేం పనిలో అనుకుంటారు. కానీ కొన్ని చట్టపరమైన అంశాలపై అవగాహన ఉంచుకోవడం అన్ని విధాల మంచిది అంటారు నిపుణులు. ముఖ్యంగా చట్టాలపై అవగాహన లేక ఆస్తి సంబంధిత విషయాలలో కోర్టులను ఆశ్రయించి చివరకు నిరాశ చెందుతూ ఉంటారు. అందరికీ ఈ నియమాలపై చట్టపరమైన అవగాహన ఉండకపోవడంతో..చాలా ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తుతున్నాయి.
నిజానికి ఆస్తి పంపకాలు ఎలాంటి గొడవలు లేకుండా జరగడానికి.. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చట్ట ప్రకారం.. అందరినీ వేధించే పూర్వీకుల ఆస్తులపై హక్కులు కొడుకులకు ఉంటాయా లేదా మనవళ్లకు ఉంటాయా అనే దానిపై అవగాహన పెంచుకోవాలి.చాలాసార్లు ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు .. పూర్వీకుల ఆస్తిపై వారసత్వ హక్కుల సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. భారతదేశంలో ఉండే చట్టాల ప్రకారం తన తాత స్వయంగా సంపాదించిన ఆస్తిపై మనవడికి ఆటోమేటిక్ బర్త్‌రైట్ అయితే ఉండదు. కానీ మనవడు పుట్టగానే పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో వాటా అయితే వస్తుంది. కానీన హక్కు ద్వారా ఆస్తిని వెంటనే స్వాధీనం చేసుకునే అవకాశం ఉండదు.
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోయినపుడు, వారి తక్షణ చట్టపరమైన వారసులు ఆ వ్యక్తి స్వీయ ఆర్జిత ఆస్తిని వారసత్వంగా పొందుతారు. అంటే చట్టపరమైన వారసులు అంటే భార్య, కుమారుడు, కుమార్తె చనిపోయిన వ్యక్తి సంపాదించిన ఆస్తిని వారసత్వంగా పొందుతారు. ఇందులో మనవడికి ఎలాంటి వాటా దక్కదు.
చనిపోయిన వ్యక్తి భార్య, కుమారులు, కుమార్తెలకు అలా సంక్రమించిన ఆస్తి..తర్వాత వారి వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది. దానిలో వాటా పొందే హక్కు కూడా మరెవరికీ ఉండదు. ఒకవేల తాత కంటే ముందుగానే ఆయన కుమారులు, కుమార్తెలు ముందుగానే చనిపోతే..వారి వారసులకు తాత నుంచి రావాల్సిన ఆస్తిలో వాటాను పొందుతారు.
కాబట్టి కుటుంబంలోని పెద్ద వ్యక్తి చనిపోతే, అతని పేరుతో ఉన్న ఆస్తి ముందు అతని కుమారునికి మాత్రమే చెందుతుంది. ఆ తరువాతే మనవడు తన తండ్రి నుంచి ఆస్తిలో వాటా పొందుతాడు. ఒక్కోసారి తాత కంటే తండ్రి ముందు చనిపోయిన సందర్బాలలో మాత్రమే ఆ మనవడు తాత ఆస్థి నుంచి నేరుగా ఆస్తిలో వాటా పొందుతాడు.
నిజానికి ఆస్తిలో మనవడికి జన్మహక్కు ఉంటుంది కాబట్టి…దీనికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తినపుడు సివిల్ కోర్టుకు వెళ్లవచ్చు.దీనిద్వారా తండ్రి లేదా తాత తన పూర్వీకుల నుంచి సంక్రమించిన పూర్వీకుల ఆస్తికి ఎలా అర్హులు అయ్యారో.. అలానే మనవడు కూడా తాత ఆస్తి పొందేందుకు అర్హులు అవుతాడు. అయితే తాతయ్య వీలునామా రాయకుండా చనిపోతే..ఆయన పూర్వీకుల ఆస్తి ఏదైనా ఉంటే అది మనవడికి నేరుగా కాకుండా ముందు తండ్రికి చేరుతుంది. అంటే మనవడు తన వాటాను డైరక్ట్ ఆస్తి హక్కుగా కాకుండా తండ్రి నుంచి పొందే ఆస్తిలో హక్కును మాత్రమే పొందుతాడు. అలాగే కొన్ని సందర్భాలలో తండ్రి స్వార్జితం కాకుండా.. తాత ఆస్తిని కొడుకుకు ఇవ్వకుండా నిరాకరిస్తే.. అప్పుడు అతను కోర్టుకు వెళ్లి న్యాయం పొందొచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE