చాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతుంటారు. నలుగురిలోకి వెళ్లి ఫ్రీగా మాట్లాడలేక నానా తంటాలు పడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నోటి దుర్వాస కంట్రోల్ అవడం లేదని బాధ పడుతుంటారు. బ్రష్ సరిగా చేయకపోవడం, సైనసైటిస్‌తో బాధ పడటం కొన్ని సార్లు కడుపు సంబంధిత వ్యాధులు ఉన్నా కూడా నోటి దుర్వాసన వేధిస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. కొన్ని సార్లు ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఈ సమస్య వస్తుందని అంటున్నారు.
నోటి దుర్వాసనతో బాధపడేవారు నలుగురిలోకి వెళ్లి.. ఎవరితోనైనా మాట్లాడటం కష్టంగా ఉంటుంది. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం రాంగ్ డైట్ అని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. పోషకాహారం తీసుకోవడంతో పాటు కొన్ని సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే చాలని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోకపోవడంతో పాటు, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అందుకే తప్పనిసరిగా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకునే పడుకోవాలి. అలాగా ఆహారం తిన్న ప్రతీసారి పుక్కిలించాలి. అలాగే బయట దొరికే మౌత్ ప్రెషనర్లు కాకుండా ఇంట్లో ఉండే సహజసిద్ధమైనవాటిని మౌత్ ప్రెషనర్లుగా వాడుకోవచ్చని అంటున్నారు.
పుదీనా నోటి దుర్వాసనకు మంచి రెమెడీ అని వైద్యులు చెబుతున్నారు. సోంపు, యాలకులు, పుదీనా వంటివి కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా బాగా పని చేస్తాయి. భోజనం చేసిన తర్వాత పుదీనా ఆకులను నమలితే.. నోరు దుర్వాసన రాకుండా ఉంటుందని అంటున్నారు.
నోటి దుర్వాసన పోగొట్టడంలో లవంగాలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.ఇవి మన నోటిలోని చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి కాబట్టి..లవంగాలు తినడం వల్ల నోరు దుర్వాసన రాదు.
అంతేకాదు కొత్తిమీర కూడా ఒక అద్భుతమైన క్రిమినాశక ఆకుకూర. దీనిలో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది. అందుకే భోజనం తిన్న తర్వాత కొత్తిమీర ఆకులను బాగా నమిలి తినడం వల్ల నోటి దుర్వాసనను పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
, , ,