తెల్లవారుజామున వచ్చే డ్రీమ్స్ నిజంగానే నిజమవుతాయా?

Are Early Morning Dreams Come True in Life and What Causes Vivid Dreams,Are Early Morning Dreams Come True,Morning Dreams Come True in Life,What Causes Vivid Dreams,Mango News,Mango News Telugu,Dreams, Do dreams come true in the morning?,According to the time of sleep, dreams are divided into four parts in science,dreams will give bad results,Dreams Come True in Life,Vivid Dreams,Early Morning Dreams Latest News

చాలామంది గాఢ నిద్రలోకి వెళ్లగానే కలలు రావడం కామన్. అయితే చాలామందికి ఎక్కువ శాతం రాత్రి సమయంలోనే రకాల కలలు వస్తూ ఉంటాయి. అలాగే తెల్లవారుజామున కూడా మరికొందరికి కలలు వస్తుంటాయి. అయితే తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని జనాలు నమ్ముతారు. మరి నిజంగానే అప్పుడు వచ్చిన కలలు నిజమవుతాయా అనేది చాలామందిని వేధించే ప్రశ్న.

నిజానికి నిద్ర సమయాన్ని బట్టి కలలను శాస్త్రాలలో నాలుగు భాగాలుగా చెబుతూ ఉంటారు. అందులో మొదటి భాగంలో వచ్చిన డ్రీమ్స్.. ఏడాది తర్వాత చెడు ఫలితాలను ఇస్తాయని..అలాగే రెండవ భాగంలో వచ్చిన కలలు ఆరు నెలల నుంచి 12 నెలల్లో ఫలితాన్నిస్తాయని అంటారు. ఇక మూడవ భాగంలో వచ్చిన కలలు మూడు నెలల నుంచి 6 నెలల్లో ఫలితాన్నిస్తాయి. ఇక నాల్గవ భాగంలో వచ్చిన కలలు 1 నుంచి 3 నెలల్లో ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెబుతుంటారు.

అయితే సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు.. అంటే తెల్లవారుజామున కల వస్తే ఆ ఫలితం సుమారు 15 రోజుల్లో ఉంటుందని అర్థం. కలలో నెత్తి మీద మీద పెట్టుకున్న కంచు వంటి పాత్రలు పగిలి పోవటం, క్షవరం చేయించుకుంటున్నట్టు కనిపించటం, ఒంటి మీద వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, పాత బట్టలు ధరించటం, నూనె కానీ బురద కానీ పూసుకోవటం, పై నుంచి కింద పడటం వంటివి మంచిది కాదట. ఇలాంటి కలలు ఏదైనా చెడు జరుగుతుందని సంకేతాన్ని పంపుతాయట. అలాంటి కలలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

అలాగే పాములను పట్టుకుని చంపటం, రెడ్ కలర్ పూలతో నిండిన చెట్లు, కుక్క కానీ గాడిద కానీ ఒంటె కానీ కనిపించటంతో పాటు మనం ఆ జంతువులపై ఎక్కినట్టుగా కలలో కనిపిస్తే అది కూడా శుభ ప్రదం కాదట. పక్షి మాంసాన్ని తినటం, నూనెను తాగటం, చితిపైకి ఎక్కటంతో పాటు కలలో ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించడాన్ని కూడా చెడు కలలుగానే భావిస్తారు.. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పన్ను రాలినట్లు కల వస్తే ఇంట్లో ఎవరో వ్యక్తులకు ప్రాణ గండం ఉన్నట్లు సంకేతమట. కలలో అద్దం కనిపిస్తే మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు అర్ధం.

ఇలా మంచి కలల విషయానికి వస్తే.. కలలో చేపలు కనిపిస్తే ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. అలాగే దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో పాస్ అవుతారు. కాళ్లు, చేతులను కడుగుతున్నట్లు కనిపిస్తే ఇక అప్పటి నుంచి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని అర్ధమట. కలలో పాము కనిపిస్తే చాలామంది దుస్సప్నంగా అనుకుంటారు. అయితే కలలో పాము కనిపిస్తే భవిష్యత్తులో మీరు ఏం అనుకుంటారో అవన్నీ నెరవేరుతాయట. ఇక పెద్దవాళ్లు దీవిస్తున్నట్లు, పాలు కానీ నీళ్లు కానీ తాగుతున్నట్టు కనిపిస్తే త్వరలోనే సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని సంకేతమట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =