బొప్పాయి పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని అందరికీ తెలిసిందే. పండుతో పాటు బొప్పాయి ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులతో జ్యూస్ చేసి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని అంటున్నారు. ఈ జ్యూస్ తాగడం వల్ల జ్వరం రాకుండా రక్షిస్తుంది.
బొప్పాయి ఆకులలో విటమిన్ ఎ విటమిన్ ఇ,విటమిన్ సి,విటమిన్ కె,విటమిన్ బి లు అధికంగా ఉంటాయి. ఆకలి తక్కువగా ఉన్నవారికి బొప్పాయి ఆకుల జ్యూస్ మేలు చేస్తుంది. బొప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయట. మధుమేహం ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు బొప్పాయి ఆకు జ్యూస్ తీసుకుంటే మంచిది.
బొప్పాయి ఆకుల జ్యూస్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. బొప్పాయి ఆకుల్లో ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ అనే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లలా పని చేసి.. శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకుల జ్యూస్ తరచూ తీసుకోవటం వల్ల పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచేయడంలోనూ బొప్పాయి ఆకుల జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను కూడా ఇది క్రమబద్ధీకరిస్తుందట. అంతేకాదు చుండ్రు, జుట్టు రాలిపోవడం, తలలో దురద, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి బొప్పాయి ఆకుల రసం బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఎటువంటి జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడినపుడు ప్లేట్‌లెట్స్ పడిపోకుండా చేయడంలో బొప్పాయి ఆకులు బాగా పనిచేస్తాయి.