చాలా మంది అధికబరువును తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది తిండి మానేసి విటమిన్ల లోపంతో బాధపడతుంటే మరి కొంతమంది మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్టు చేసుకుంటున్నారు తప్ప వెయిట్ లాస్ మాత్రం అవడం లేదు.
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, కూర్చుని చేసే ఉద్యోగాలు వంటి రకరకాల కారణాలతో త్వరగా లావయిపోతున్నారు. బరువు ఈజీగా పెరుగున్నా..తగ్గించుకోడం మాత్రం వీరి వల్ల కాకపోవడంతో చాలా మంది బరువు తగ్గడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
కానీ ఎంత చేసినా.. ఏం చేసినా బరువు తగ్గకపోవడంతో..డిప్రెషన్‌లోకి వెళుతున్నారు. అది మరీ డేంజర్ అంటున్నారు వైద్యులు. రోజూ పచ్చని వాతావరణంలో కాసేపు నడిస్తే చాలని సలహా ఇస్తున్నారు. ప్రతి రోజూ కనీసం అరగంట అయినా క్రమం తప్పకుండా నడవడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ వారీ నడకతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
రోజులో మిగిలిన గంటలు ఎంత బిజీగా ఉన్నా.. కాసేపు బయటికి వెళ్లి పచ్చని వాతావరణంలో వాకింగ్ చేస్తే స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఉండటంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగించే నడక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బాడీలో త్వరగా మార్పులు తీసుకువస్తుంది.
ప్రతిరోజూ ఇలా నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరగవడంతో పాటు ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రతి రోజూ నడవడం వల్ల జీవక్రియ పెరిగి కేలరీలు బర్న్ అయి బరువు తగ్గుతారు. రెగ్యులర్‌గా ఇలా వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.