మీ లైఫ్ పార్టనర్‌తో కఠినంగా మాట్లాడుతున్నారా?..అయితే బీ అలర్ట్

Talking harshly with your life partner but be alert,Talking harshly with your life partner,Talking harshly but be alert,Talk to your spouse gently, Talking harshly with your life partner,husband and wife, can affect their heart, negative words, cardiovascular disease,Mango News,Mango News Telugu,Anger in Relationships,Cardiovascular disease Latest News,Cardiovascular Disease Latest Updates
Talk to your spouse gently, Talking harshly with your life partner,husband and wife, can affect their heart, negative words, cardiovascular disease

భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలను వారి గుండెపై ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. ఏ విషయం గురించైనా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు  నెగిటివ్‌గా మాట్లాడే మాటలు భాగస్వామిలో తీవ్రమైన భావోద్వేగాలను పెంచడానికి కారణమవుతాయని.. అయితే అదే మెల్లగా కార్డియోవాస్క్యులర్ డిసీజ్‌కు దారి తీస్తుందని తాజా అధ్యయం హెచ్చరిస్తోంది.

ఒత్తిడితో కూడిన మాటల వల్ల దానివల్ల శరీరంలో  కలిగే పరస్పర చర్యల వల్ల  హృదయ స్పందన రేటు, రక్తపోటులో మార్పులు జరుగుతాయని అధ్యయన కర్తలు గుర్తించారు. ఈ మార్పులు మనిషి ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావితం చేస్తాయని, అంతేకాకుండా ఈ రియాక్షన్ ఎక్కువైతే హృదయ సంబంధ వ్యాధులు కూడా అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు హెచ్చరించినట్లు తేలింది.

గ్రేటర్ చికాగో ప్రాంతానికి చెందిన 49 మంది భార్యాభర్తల జంటలపై ప్రయోగం నిర్వహించిన పరిశోధకులు.. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులో సంఘర్షణతో కూడిన చర్చలు, మరో గ్రూపులో సానుకూల చర్చలు జరిగేలా  చూసారు. ఈ ప్రయోగం జరగడానికి కంటే ముందు అన్ని జంటలు విశ్రాంతి తీసుకునేలా చేయడంతో పాటు  వారి మధ్య ఎలాంటి సంభాషణలు లేకుండా చూశారు. ఆ సమయంలో వారికి అన్ని పరీక్షలు చేశారు.

తర్వాత అధ్యయనకర్తలు అసలు ప్రయోగానికి సిద్ధం అయ్యారు. భార్యాభర్తల మధ్య జరిగే సానుకూల, ప్రతికూల చర్చలు జరిగే టైమ్‌లో బాడీలో జరిగే మార్పులను, ప్రత్యేకంగా ఆ సమయంలో వారి హృదయ స్పందనల మధ్య ఉన్నసమయాన్ని నమోదు చేశారు. దీంతో పాటు భార్యాభర్తలు ఉపయోగించే ప్రతికూల, సానుకూల భావోద్వేగ పదాల ఫ్రీక్వెన్సీ, వాటి రియాక్షన్‌ను కూడా నమోదు చేశారు.

ఈ సమయంలో ఎక్కువ ప్రతికూల భావోద్వేగ పదాలను ఉపయోగించడం అంటే  కోపంగా మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం , భాగస్వామి మనసు నొచ్చుకునేలా మాట్లాడటం వంటివి.. అధిక కార్డియోవాస్క్యులర్ రియాక్టివిటీతో సంబంధం కలిగి ఉన్నాయని  అధ్యయనం గుర్తించింది. అయితే ఈ ప్రభావం వారి ఆర్థిక పరిస్థితి, భార్యాభర్తల మధ్య సంబంధంతో ముడిపడి లేదని అధ్యయనం తెలిపింది. మొత్తంగాఒత్తిడితో కూడిన మాటల వల్ల దానివల్ల  శరీరంలో  కలిగే పరస్పర చర్యల వల్ల  హృదయ స్పందన రేటు, రక్తపోటులో మార్పులు జరుగుతాయని అధ్యయన కర్తలు గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =