బ్రోకలీ ..అచ్చం క్యాలీ ఫ్లవర్‌లానే ఉండే ఉండే ఒక రకమైన కూరగాయ. ఒకప్పుడు హై క్లాస్ పీపుల్ మెనూలో ఉండే బ్రోకలీ.. ఇప్పుడు మధ్య తరగతి వారి ఇళ్లలోనూ రెగ్యులర్ ఆహారంగా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం అందరిలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో..చాలా మంది బ్రోకలీ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్రోకలీలో ఎన్నో పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీలో పూర్తి ఆరోగ్యకరమైన పోషకాలు నిండి ఉంటాయి. బ్రోకలీలో ఎ విటమిన్, సి విటమిన్, కె విటమిన్‌తో పాటు.. పొటాషియం, ఫోలేట్, మాంగనీస్, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, రైబో ప్లేవిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా దొరుకుతాయి. నిజం చెప్పాలంటే బ్రోకలీని సూపర్ ఫుడ్‌గా నిపుణులు చెబుతున్నారు.అందుకే బ్రోకలీని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలని అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లుతో పాటు ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ వంటివి కూడా బ్రోకలీలో ఉంటాయి. ఈ శక్తివంతమైన పోషకాలు.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులయిన క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ వంటివి రాకుండా చేస్తుంది. అదే విధంగా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని బ్రోకలీ కాపాడుతుంది.
బ్రోకలీలో గుడ్ కొలెస్ట్రాల్ ఉండటంతో పాటు ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బ్రోకలీలో ఉండే ఫైబర్.. జీర్ణ వ్యవస్థలోని కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే బ్రోకలీని తరచూ తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. బ్రోకలీలో ఉండే ఫైబర్.. తిన్న ఆహారాన్ని నెమ్మదించేలా చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి.
అంతేకాకుండా బ్రోకలీ తినడం వల్ల బరువు కూడా కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటంతో పాటు.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్రోకలీ కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన ఫీలిగ్ ఉండటంతో..రోజంతా తినే క్యాలరీల సంఖ్యను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందని దీని వల్లే బరువు కంట్రోల్ లో ఉంటుందని అంటున్నారు.