ఆముదాన్ని రోజూ నాభిపై మసాజ్ చేస్తే ఎన్నో ఉపయోగాలు..

There Are Many Benefits Of Massaging Castor Oil On The Navel Daily

మన శరీరంలో బొడ్డు అనేక భాగాలకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఆముదాన్ని నాభికి అప్లై చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల మనిషి ఆరోగ్యమే కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు.

నాభికి ఆముదాన్ని రాయడం వల్ల అందులోని మెడిసిన్ గుణాల కారణంగా ఫెర్టిలిటీ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇందులోని గుణాలు సర్క్యూలేషన్‌ని పెంచుతుంది. రీ ప్రోడిక్టివ్ ఆర్గాన్స్ సరిగా పనిచేస్తాయి. ఫెర్టిలిటీ సమస్యలు దూరమవుతాయి.

కొంతమంది జాయింట్ పెయిన్స్, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడతారు. ఇలాంటి సమస్యలకి ఆముదం మంచి రెమిడీ అని ఆయుర్వేదంలో ఉంది. ఆముదంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల పెయిన్, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.

ఆముదాన్ని బొజ్జపై రాయడం వల్ల మెనుస్ట్రువల్ పెయిన్స్ తగ్గుతాయి. ఆముదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల కడుపు సంబంధిత సమస్యలు, కడుపునొప్పి, క్రాంప్స్ సమస్యలు దూరమవుతాయి. ఆముదాన్ని రాయడం వల్ల నేచురల్‌గా బాడీ క్లెన్స్ అవుతుంది. ఆముదంలో డీటాక్స్ గుణాల వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. తరచుగా ఆముదాన్ని నాభికి పూస్తే బాడీలోని టాక్సిన్స్ దూరం అవుతాయి.

ఆముదాన్ని బొడ్డు దగ్గర రాయడం వల్ల దీనిలో ఉండే నేచురల్ లాక్సేటివ్ గుణాలతో బౌల్ మూమెంట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. పొత్తికడుపు, జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

ఆముదాన్ని తరచూ రాసుకోవడం వల్ల స్కిన్ మాయిశ్చరైజ్ అయి అందంగా మారుతుంది. స్కిన్ ఆముదాన్ని అబ్జార్బ్ చేసుకోవడంతో చర్మం మృదువుగా మారుతుంది. ఆముదాన్ని రాయడం పెదాల పగుళ్లు తగ్గడంతో పాటు..పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. ఆముదాన్ని రాయడం వల్ల మాయిశ్చరైజర్‌లా పని చేసి..డ్రై స్కిన్ దూరమవుతుంది.