ఒంటరితనం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు డెత్ రిస్క్ కూడా ఎక్కువేనట

Life Expectancy is Reduced if You are Alone,Life Expectancy is Reduced,If You are Alone,Interactive social activities,Life expectancy is reduced, Alone, Loneliness,depression , Social activities, Risk of death,Isolation shortens lifespan,Mango News,Mango News Telugu,How to deal with loneliness,Loneliness Is Harmful,Life expectancy Latest News,Life expectancy Latest Updates,Life expectancy Live News
interactive social activities,Life expectancy is reduced, alone, Loneliness,depression , risk of death

ఎక్కువ కాలం పాటు ఫ్యామిలీని, ఆత్మీయులను, స్నేహితులను చూడకుండా ఉండాల్సి వస్తే.. అది ఆ వ్యక్తి యొక్క ఆయుష్షును తగ్గిస్తుందట. అవును ఈ విషయాన్ని స్కాట్‌లాండ్‌‌కు చెందిన పరిశోధనలు చెబుతున్నాయి. సోషల్ యాక్టివిటీస్‌లో ఇంటరాక్ట్ అవడం, పర్సనల్ ఇంటరాక్షన్స్ వంటివి లేకపోవడం వంటి కారణాలకు, డెత్‌రిస్క్‌ మధ్య గల సంబంధాన్ని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా సోషల్ ఫ్యాక్టర్స్ మనిషి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని నిశితంగా అబ్జర్వ్ చేశారు.

ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఇంటరాక్షన్ లేని వ్యక్తుల మరణాలకు చేరువయ్యే రిస్క్ 49 శాతం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే చాలా మంది అనారోగ్యానికి గురవుతున్న సమస్యల్లో.. లోన్లీనెస్, సామాజిక ఒంటరితనం కూడా కారణమనే  విషయం తెలిసిందే. కానీ ఇది కేవలం ఒంటరితనాన్ని పెంచడమే కాకుండా డెత్ రిస్క్‌తోనూ ముడిపడి ఉన్నట్లు తాజా అధ్యయనాలు తేల్చాయి. సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ సంఖ్య లేదా సోషల్ ఈవెంట్స్‌కు అటెండ్ అయ్యే వారి కంటే కూడా కుటుంబసభ్యులు స్నేహితులతో ఉండే భౌతికపరమైన సోషల్ కనెక్షన్ ఇక్కడ కీ రోల్ పోషిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు.

పరస్పర ఇంటరాక్షన్ వల్ల మనం ఎలాంటి అనుభూతికి లోనవుతామనే  దానిని బట్టి కూడా పాజటివ్ రిజల్ట్, నెగెటివ్ రిజల్ట్ అనేవి ఉంటున్నాయి. అందుకే ముఖ్యంగా కుటుంబం, ఆత్మీయుల పరస్పర పలకరింపులు అందరికీ  ఉండాలని అధ్యయనకర్తలు చెబుతున్నారు.  ఎందుకంటే సామాజిక చర్యలకు దూరమైన వారిలో ఆయుష్షు తగ్గడంతో పాటు గుండె జబ్బుల వంటి ప్రమాదం పెరగడం వంటివ సంభవిస్తున్నాయి. అంతేకాకుండా.. ఈ అలవాట్లు మరణానికి దారి తీస్తున్న అనారోగ్యాలు, రుగ్మతలు సంభవిస్తున్నాయని అధ్యయనకర్తలు చెప్తున్నారు.

అధ్యయనంలో భాగంగా  లండన్‌లో బయోబ్యాంక్‌లో భాగమైన 4,58,146 మంది అడల్ట్స్‌‌కు సంబంధించిన డేటాను అందులో పరిశీలించినట్లు పరిశోధకులు తెలిపారు. ఇందులో ఎక్కువమంది సగటు వయస్సు 50 ఏళ్లపైబడే ఉంది. అయితే వీరి సామాజిక యాక్టివిటీస్‌కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో లోన్లీనెస్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్, అలాగే ఎవరినైనా విశ్వసించగల సామర్థ్యం, స్నేహితులు, కుటుంబ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండటం, ఇంటరాక్ట్ అవడం, మాట్లాడటం, యోగక్షేమాల గురించి  తెలుసుకోవడం వంటివి పాజటివ్ అంశాలు ఉన్నాయి.

అలాగే ఒంటరిగా ఉంటూ ఎవరితోనూ కలవకుండా జీవించిన వారిని కూడా అధ్యయనకర్తలు ఎనలైజ్ చేశారు. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 12 ఏండ్లకు పైగా పరిశోధకులు తమ పరిశోధనలు కొనసాగించారు. ఇలా స్టడీచేసిన అధ్యయనకర్తలు 33,135 మంది మరణానికి గల కారణాలను వీరు తమ అధ్యయనంలో విశ్లేషించారు. ఇందులో ఒంటరితనం, ఆ సమయంలో వారు ఫీలయ్యే భావనలు, తమకు ఇష్టమైన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులను కలిసినప్పుడు కలిగే మానసిక స్పందనలను గమనించారు. ఇలాంటివారందరికీ పలకరింపులు దూరం కావడం, సామాజిక పరస్పర చర్యలు లేకపోవడం వల్లే వీరంతా త్వరగా మరణానికి దగ్గరైనట్లు కనుగొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twenty =