రెండు రోజులు ఏమీ తినకుండా ఉండగలం కానీ ఒక్క పూట నీరు లేకుండా ఉండాలంటే చాలా కష్టం. అందుకే నీళ్లు తాగుతూ ఉండాలని అది మన శరీరాన్ని డీ హైడ్రేడ్ కాకుండా చేస్తుందని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి తమ శరీరంలో ఎంత నీరు ఉందో.. రోజుకు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలో తెలీదు. ఇలాంటివారికోసం ఓ చిన్న చిట్కా చెబుతున్నారు నిపుణులు.
మన మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారి పైకిలాగి వదిలితే.. అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లు లెక్క అని.. అలాకాకుండా ముడతలు పడుతూ వెంటనే పూర్వస్థితికి రాలేకపోతే మాత్రం శరీరంలో సరిపడా వాటర్ లేనట్లే అర్ధం చేసుకోవాలి అని అంటున్నారు. అంటే ఇలా నీళ్లు తక్కువ అయినవారు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు.డీహైడ్రేషన్‌కు గురయినప్పుడు చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాకుగా ఉంటుంది. మూత్రం కూడా తక్కువగా వస్తుంది. ఏదో మత్తు ఆవహించినట్లు నీరసంగా అన్పిస్తూ.. కండరాలు బాగా నొప్పి వస్తాయి.
ఇవే కాకుండా మరి కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తాగాలని వైద్య నిపుణులు చెబుతారు. ముఖ్యంగా మధ్యాహ్నం ముందు ఎక్కువ మోతాదులోనూ, మధ్యాహ్నం తిన్న తర్వాత తక్కువ మోతాదులో నీరు తాగాల్సి ఉంటుందని అంటున్నారు.నిజానికి ప్రతి మనిషి శరీరంలో 65 శాతం వరకు నీరే ఉంటుంది.
ఒక వ్యక్తి 20 కిలోల బరువు ఉంటే..అతను ఒక లీటరు నీటిని తాగాలని అనేక పరిశోధనలలో తేలింది. ఉదాహరణకు మీరు 70 కిలోల శరీర బరువు ఉంటే, అప్పుడు 20 కిలోలకు ఒక లీటర్ చొప్పున 3.5 లీటర్ల నీరు తాగాలి. 80 కిలోలు ఉంటే, 4 లీటర్లు మంచినీటిని తాగాలి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం, ఒక మహిళ ప్రతిరోజూ 11.5 కప్పుల నీరు తాగాలి. అంటే 2.7 లీటర్లు. అదే సమయంలో, పురుషుడికి 15.5 కప్పుల నీళ్లు అంటే ప్రతిరోజూ 3.7 లీటర్లు తాగాలి.
ఆహారం, జీవనశైలి, వాతావరణ మార్పులపై నీళ్ల మోతాదు ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ తాగే నీళ్ల పరిమాణంతో పాటు ఏ ప్రాంతంలో ఎక్కడ నివసిస్తున్నారు, ఏ ఉష్ణోగ్రతల దగ్గర ఉంటున్నారు, ఏ వాతావరణంలో జీవిస్తున్నారు, ఎంత చురుకుగా ఉన్నారు, మీ ఆరోగ్యం, గర్భధారణ మొదలైన వాటిపైన నీటిని తాగడం ఆధారపడి ఉంటుంది.
అయితే అతిగా నీరు తాగినా కూడా సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. అతిగా మంచినీరు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతిని.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అటు గుండె, మూత్రపిండాలు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు రక్తం పెరగడం కారణంగా రక్తనాళాలు, గుండెపై అదనపు భారం పడుతుంది. దీనిద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.
అతిగా నీళ్లు తాగితే శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయిలు తగ్గి మరణానికి కూడా దారి తీస్తుంది. అంతే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడి.. తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సో నీటిని తాగడానికీ ఓ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY