చలికాలంలో ఈ ఆకుకూర తప్పనిసరిగా తినండి..

This Green Vegetable Is A Must Eat In Winter, Mustard, Mustard Greens, Mustard Powder, Green Vegetable, Cold Weather, Healthy Food In Winter, Winter Healthy Food, Best Ways to Stay Healthy In Winter, Winter Wellness, Tips For Staying Healthy This Season, Winter Health Care, Health, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

మిగిలిన అన్ని కాలాల కంటే కూడా చలికాలంలో కాస్త ఎక్కువగా కేర్ తీసుకోవాలి. చలి కాలంలో మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీనికోసం పోషక విలువలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. దీనిలో తగినంత మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు ఎన్నో ఉంటాయి.

అయితే అన్ని ఆకుకూరల్లో.. ఆవ ఆకు కూర తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. ఆవ ఆకుకూరలో ఫోలేట్ ఉంటుంది. ఇది గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. ఆవపిండి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి..గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నిజానికి ఆవాలు, ఆవాల ఆకులు, ఆవ పిండిలో కూడా ఐరన్ పుష్కలంగానే ఉంటుంది. ఇది మీ శరీరంలో ఐరన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఆవ ఆకు కూర తినటం వల్ల మీ జీవక్రియ రేటు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ఆవ ఆకులలో డైటరీ ఫైబర్ కలిగి ఉండటంతో.. ప్రేగు కదలికను పెంచి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఆవలో కాల్షియం, పొటాషియం ఉండటంతో..ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ ఆకుకూరలు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. ఆవలో తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

దీనితో పాటు ఆవాలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఆవపిండిలో కూడా ఫైబర్ ఉండటంతో చాలా కాలం పాటు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. వేగంగా బరువు తగ్గడంతోపాటు స్థూలకాయం కూడా దూరమవుతుంది.ఆవలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి చలికాలంతో తప్పనిసరిగా తీసుకోవడానికి ప్రయత్నించండి.