మీరు బరువు పెరుగుతున్నారా? ఒత్తిడి వల్లేమో ఒకసారి చెక్ చేసుకోండి..

Do You Know How Stress Can Lead To Weight Gain And How To Fight It,Do You Know How Stress Can Lead,Stress Can Lead To Weight Gain,How To Fight It,How Stress Can Lead,Mango News,Mango News Telugu,Are You Gaining Weight, Check If It Is Due To Stress, Stress Relief, Tensions, Yoga, Walking,Regular Exercise, Healthy Food Choices,Stress And Weight Gain,Ways Stress Makes You Gain Weight,How Stress Can Lead News Today,How Stress Can Lead Latest News,How Stress Can Lead Latest Updates

ఒత్తిడి లేని మనుష్యులు ఇప్పుడు ఎక్కడా లేరు. ఉద్యోగంలో పని ఒత్తిడి.. కెరీర్ కోసం టెన్సన్స్, ఆరోగ్య సమస్యలు, కుటుంబ భారం ఇలా రకరకాల ఒత్తిడులు మనిషిని కుదురుగా ఉండనీవవు. అయితే మానసిక ఒత్తిడి పెరిగితే శారీరకంగానూ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఒత్తిడితో బరువు పెరుగుతారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

ఒత్తిడి నాడీ వ్యవస్థని ప్రేరేపించడంతో.. ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. కార్టిసాల్ స్థాయిలు ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు పనిచేస్తాయి. వీటి స్థాయిలు తగ్గిపోతే ఆటోమేటిక్‌గా బరువు పెరిగిపోతారు. దాంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో ఎన్నో సమస్యలకు ఒత్తిడి కారణం అవుతుంది. అంతేకాదు దీర్ఘ చేయాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఒత్తిడి పెంచుతుంది. అకస్మాత్తుగా బరువు పెరగడానికి ఒత్తిడి కారణం కాబట్టి.. ఒత్తిడి స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటారు. దాని వల్ల ఈజీగా బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. కార్టిసాల్ అనేది ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు.. శరీరం విడుదల చేసే ఒక హార్మోన్. ఇది శరీరం నుంచి విడుదలైనప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది. అందుకే ఒత్తిడిని పెంచే కార్టిసాల్ కంట్రోల్ చేసుకోవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. శ్వాస మీద ద్యాస పెట్టి ధ్యానం చేయడం, లేదా.. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలని కంట్రోల్ చేసుకోవచ్చు.

అలాగే నిద్రలేమి సమస్య వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, ఇతర టెన్షన్స్ వంటి ఇబ్బందులన్నా ఒత్తిడి పెరిగి బరువు పెరిగిపోతారు. అందుకే వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం, ఇష్టమైన పుస్తకాలు చదవడం, మంచి సంగీతం వినడం, ఇతర హాబీలను పెంచుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి. కాసేపు ఫ్యామిలీతో గడిపినా ఒత్తిడి, ఆలోచనలు అన్నీ దూరమవుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం క్రమం తప్పకుండా చేయటం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, వాకింగ్ వంటివి చేయడంతో పాటు మనసు ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మైండ్ ని ప్రశాంతంగా ఉంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ప్రయత్నించండి. టెన్సన్స్ పడితే సమస్య నుంచి బయటపడలేం సరికదా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని గ్రహించాలి. అయితే ఎన్ని చేసినా ఒత్తిడి ఏమాత్రం తగ్గకపోతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఒత్తిడి తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా బరువు కూడా తగ్గిపోతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =