వీక్నెస్‌కు ఇలా చెక్ పెట్టొచ్చట..

This Is How You Can Check For Weakness,Almonds,Antioxidants,Blood Sugar Levels,Calcium,Cholesterol,Health Tips,Weakness Bother You,Mango News,Mango News Telugu,Food,Meals,Health Tips Telugu,Healthy Eating Tips,Healthy Eating Benefits,Health Care,Fitness,Diet Tips,Health Tips Telugu,Simple Diet,Fitness Tips,Lifestyle News In Telugu,Healthy Eating And Diet,Health Tips Eating,Based Health Benefits Of Almonds,Health Benefits Of Almonds And Its Nutrition Value,Health Benefits Of Almonds,Almonds Benefits,Benefits Of Almonds,Benefits Of Soaked Almonds,Eating Nuts For Heart Health,Almonds Uses

చాలామంది వీక్నెస్‌తో బాధపడుతూ ఉంటారు. ఏ పని మీద శ్రద్ద లేకపోవడం, నిద్రపోవాలనిపించడం, కాళ్లు నొప్పులు వేధించడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివారు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు డ్రింక్ తాగితే 60 లో కూడా 20 ఏళ్ల వ్యక్తిలా హుషారుగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కాల్షియం లోపం ఎక్కువగా ఉంటే దీని వల్ల ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. కాల్షియం లోపం వల్ల ఏ పని చేయడానికి అనాసక్తితో పాటు.. తీవ్రమైన అలసట,నీరసం ఉంటాయి. ఇలాంటివారంతా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వీక్నెస్ తో బాధపడేవాళ్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. నువ్వులు, బాదంపప్పులు, గసగసాలతో వీక్నెస్ కు చెక్ పెట్టొచ్చంటున్నారు

ఈ ఎనర్జీ డ్రింక్ కోసం.. ముందుగా పాన్ లో రెండు స్పూన్ల నువ్వులు, 5,6 బాదంపప్పులు, రెండు స్పూన్ల గసగసాలను వేసి కొద్దిగా వేపుకొని మిక్సీలో వేసి మెత్తని పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మోతాదులో కూడా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.ఈ పొడిని తయారుచేసిన తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి.. ఆ గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి దానిలో ఒక స్పూన్ పొడిని వేసి మూడు పొంగులు వచ్చాక చిన్న బెల్లం ముక్క వేసి స్టౌ ఆఫి చేసి ..ఆ వేడి పాలను తాగాలి.

డయాబెటిస్ ఉంటే మాత్రం వారు బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను ప్రతి రోజూ రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. ఇలా వేడి పాలు తాగటం వల్ల నీర్సం తగ్గి యాక్టివ్ గా ఉండటంతో పాటు నిద్రలేమి సమస్య నుంచి కూడా బయట పడతారు.

ఈ పొడిలో వాడే నువ్వుల్లో ఉన్న ఫైబర్.. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.బాదంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి. గసగసాలు జీర్ణ సంబంధ సమస్యలను లేకుండా చేస్తాయి. అంతేకాకుండా ఈ పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి,దగ్గు,ఉబ్బసం వంటివి కూడా తగ్గుతాయి. దీనిని ప్రతి రోజూ తీసుకోవటం 60 ఏళ్లలో కూడా ఎలాంటి నీర్సం, అలసట లేకుండా ఉంటారు.