మారుతున్న వాతావరణం, ఆహారపుటలవాట్లు, కాలుష్యం వల్ల ఇప్పుడు చాలా మంది చిన్నవయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 40 దాటితే కనిపించే తెల్లవెంట్రుకలు ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసువారిలోనూ కనిపిస్తున్నాయి. దీంతో దీని కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే కొంతమంది తెల్ల జుట్టుకు చెక్ పెట్టడానికి.. జుట్టుకు రంగు వేయడం తప్పదనుకుని రంగులు వేస్తుంటారు. కానీ, మరికొంతమంది మాత్రం ఫ్యాషన్ కోసం జుట్టును రకరకాల కలర్స్ లో కనిపించేవిధంగా అదే పనిగా కలర్స్ వేస్తున్నారు. అయితే అతిగా హెయిర్ కలర్స్ వాడితే ప్రమాదమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
అధ్యయనాలు చెబుతున్నదాని ప్రకారం, జుట్టుకు తరచుగా హెయిర్ కలర్ వేస్తూ ఉండటం వలన కొన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నట్లు తేలిందని నిపుణులు అంటున్నారు. అందుకే మరీ తప్పని సరి అయితేనే జుట్టుకు రంగులు వేసుకోవాలని.. ఒకవేళ అలా వేసుకునమనవాళ్లు.. వారి జుట్టుకు రంగు వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
జుట్టుకు కలర్ వేసేవాళ్లు రెగ్యులర్ గా హెయిర్‌కు నూనెను రాస్తూ ఉండాలి. ముఖ్యంగా తలకు స్నానం చేయడానికి ముందు జుట్టును వేడి నూనెతో మసాజ్ చేయాలి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. వారానికి రెండు సార్లు మాత్రమే షాంపూతో హెడ్ బాత్ చేయాలి. అలాగే సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించాలి. అలాగే క్లోరిన్ తక్కువగా ఉన్న నీటితో స్నానం చేయాలి.
వీలయినంత వరకూ ఆర్గానిక్ కలర్స్ వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మెహందీ, కాఫీ పౌడర్, మెంతి పొడి కలిపి రాసుకున్నా జుట్టు రంగు బాగుంటుంది. హెయిర్ కలర్ మారడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ పొడులు మంచివి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భయంకరమైన క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE