
మనిషిలోని నాలుక కేవలం మాట్లాడటానికి, ఆహారం రుచి తెలియడానికి మాత్రమే అని అంతా అనుకుంటారు.కానీమ ఆరోగ్యం విషయంలోనూ నాలుక కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నాలుక రంగుతో పాటు నాలుకపై ఏర్పడే మచ్చలు, వివిధ మార్పులు వంటి లక్షణాలను బట్టి శరీరంలో క్యాన్సర్ సహా, వివిధ రోగాలను తెలుసుకోవచ్చని అంటున్నారు.
నాలుక సాధారణంగా ఉండే రంగుగా కాకుండా రోజుల తరబడి ఇంకాస్త ఎర్రగా మారడం లేదా పింక్ నుంచి స్కార్లెట్‌కి మారితే కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లక్షణం కవాసకి వ్యాధిలో కనిపిస్తుంది.కొన్నిసార్లు విటమిన్ల లోపం, పిల్లల్లో స్కార్లెట్ జ్వరం వల్ల కూడా నాలుక ఎర్రగా మారుతుంది. పెద్దల్లో మాత్రం దీర్ఘకాలం ఎరుపు రంగు కనిపిస్తే అది కచ్చితంగా క్యాన్సర్ లక్షణంగానే అనుమానించాలి.
అలాగే నాలుకపై తెల్లటి మచ్చలు కనిపించడం లేదా నాలుక రంగు పూర్తిగా మారడం ఇంకా కొన్ని సందర్భాలలో ఏదో క్రీమ్ వంటి పదార్థం ఉత్పత్తి అయితే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఈ రంగు మార్పు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వారిలో కూడా సంభవిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. అలాగే క్రీమీ నాలుక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ రంగు మార్పు ఉంటుంది. ఇది తీవ్రంగా మారితే మారితే అది ల్యుకోప్లాకియా వ్యాధికి దారితీసి తర్వాత క్యాన్సర్ గా మారుతుంది.
వీటితో పాటు నాలుకపై పగుళ్లు, పగుళ్లుగా కనిపించడం, మంట పుట్టడం వంటివి కూడా విటమిన్ లోపంతో పాటు ఏదో ఒక వ్యాధికి సంకేతమేనని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఇది ఎసిడిటీవల్ల, నరాల రుగ్మత వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు కనుక ఇదే సమస్యతో బాధపడుతుంటే సోరియాసిస్ సిండ్రోమ్ కిందే లెక్క..దీనిని కనుక నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఒకవేళ నాలుక మీద చిన్నగా వెంట్రుకలు పెరగడం, ముళ్లు పెరగడం వంటివి కనిపిసమతే డేంజర్‌లో పడినట్లే. ఈ లక్షణాలతోపాటు తెలుపు, నలుపు లేదా గోధుమ రంగులోకి నాలుక మారితే మాత్రం ప్రోటీన్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. అలాగే ఈ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియా వల్ల కూడా కనిపిస్తాయి. ఇవే మెల్లగా క్యాన్సర్ కారకంగా మారొచ్చు.
నాలుక నల్లబడటం అనేది చాలా తక్కువ కేసుల్లో చూస్తుంటాం. ఒకవేళ ఎవరిలోనైనా అలా నల్లగా మారుతుందటే..అందులోనూ వాళ్లు డయాబెటిస్ పేషెంట్లు అయి ఉంటే గనుక వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణంగా ఈ నల్లగా అవడం అనేది గా యాంటీ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకున్నవారిలో కనిపించే అవకాశం ఉంది. కానీ మామూలు వ్యక్తులకు ఇలా జరిగితే మాత్రం వెంటనే కేర్ తీసుకోవాల్సిందే.
అలాగే నాలుకపై ఏదైనా గాయం అయినట్లుగా కనిపించడం, దీంతో పాటు ఆహారం తినడానికి ఇబ్బంది పడటం కనుక జరిగితే అందులోనూ ఇది చాలా రోజులు అయినా కూడా తగ్గకపోవడమనేది చాలా డేంజర్. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మెడిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఆ మందులతో కూడా ఇది నయం కాకపోతే వారిలో కచ్చితంగా క్యాన్సర్ వచ్చిందని అనుమానించవచ్చని వైద్యులు అంటున్నారు..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY