ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మనమందరం జీవనోపాధి కోసం పని చేస్తాము. కానీ అలాంటి జీవితంలో ప్రశాంతత లేకపోతే మనం రోజూ ఎంత కష్టపడి పనిచేసిన ప్రయోజనం ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన రుగ్మతలు, ఒత్తిడి వంటి కారణాల వల్ల నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇవే కాకుండా అధిక చక్కెర వినియోగం వల్ల కూడా నడుము భాగంలో కొవ్వు పెరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
మనం తీసుకునే ఆహారం పెరిగే కొద్దీ మన శరీర ఆకృతి కూడా కొద్దిగా మారుతుంది. మంచి మార్గంలో మారితే పర్వాలేదు. కానీ మన ఆకారం మనకు ఇష్టం లేనట్లు ఊబకాయం రూపంలో మారిపోతే అది మనశ్శాంతిని, ఆనందాన్ని పాడుచేస్తుంది. ముఖ్యంగా నడుములో పేరుకపోయిన కొవ్వు ఆనారోగ్యాన్ని కల్పించడంతో పాటు అందమైన శరీర ఆకృతి లేకుండా చేస్తుంది. రకరకాల వ్యాయామాలు చేసినా నడుము కొవ్వు కరగడం లేదని బాధపడే వారు ఈ కింది విధంగా చేయండి.
సీతాకోకచిలుక భంగిమ
దీనిని బద్ద కోనాసన అని కూడా అంటారు. హాయిగా కూర్చున్నప్పుడు నడుము కొవ్వు కరిగిపోయే అద్భుతమైన యోగాసనం ఇది. నడుము కొవ్వును కరిగించడమే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేసే యోగాసనం ఇది. ముందుగా, హాయిగా కూర్చుని, మీ కాళ్లను ముందుకు చాచి, మీ మోకాళ్లను వంచి, మీ రెండు పాదాలను మీ తుంటి వైపుకు తీసుకురండి. ఇప్పుడు మీ రెండు పాదాలను కలిపి మీ రెండు చేతులతో పట్టుకోండి. సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా మీ మోకాళ్లను నెమ్మదిగా పైకి క్రిందికి స్వింగ్ చేయండి. మీ వీపును నిటారుగా ఉంచుతూ మీ తుంటిని సున్నితంగా విస్తరించండి.
నిటారుగా కూర్చోవడం
ఈ అభ్యాసం చాలా మంచిది. వీలైనంత వరకు నిటారుగా కూర్చోవడం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది మీ శరీర బరువును తగ్గిస్తుంది అలాగే మీ భంగిమను సరి చేస్తుంది. ఏదైనా సందర్భంలో, మీరు కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోండి. ఆరోగ్య పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నిటారుగా కూర్చోవడం వల్ల మన శరీరంలో రోజుకు 350 కేలరీలు బర్న్ అవుతాయి. రోజూ ఇలా చేయడం వల్ల మీ పొట్ట చుట్టు ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది.
ఎక్కువ నీరు త్రాగాలి
మీ శరీరంలో నీటి లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అంటే డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం ఏర్పడవచ్చు. నిటారుగా కూర్చుని నీరు త్రాగడం వల్ల మన జీర్ణక్రియ మరియు జీవక్రియ మెరుగుపడుతుంది. మనం తాగే నీరు నడుము కొవ్వును కరిగించడంలో చాలా సహాయపడుతుంది.